అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్‌

Update: 2020-12-07 08:00 GMT
బిగ్‌ బాస్‌ లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనిపించిన అవినాష్‌ అనూహ్యంగా ఎలిమినేట్‌ అయ్యి వెళ్లి పోయాడు. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన సమయంలో అవినాష్‌ కాస్త కంగారు పడటంతో పాటు చిన్న విషయానికి అతిగా రియాక్ట్‌ అవ్వడంతో ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయలేదు అనిపించింది. ఎంటర్‌ టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ అంటూ పేరున్న అవినాష్‌ ఎలిమినేట్‌ అవ్వడంతో ఇంటి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రతి ఒక్కరాని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అవినాష్‌ తో రాహుల్‌ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగింది.

రెగ్యులర్‌ ఇంటర్వ్యూల మాదిరిగా కాకుండా విభిన్నంగా సాగినట్లుగా ప్రోమో చూస్తుంటేనే అర్థం అవుతుంది. రాహుల్‌ తో అవినాష్‌ ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకొక్కరి గురించి చెప్పమంటూ రాహుల్‌ అడిగిన సమయంలో తనదైన శైలిలో చాలా విభిన్నంగా మాట్లాడాడు. అరియానా విషయానికి వచ్చినప్పుడు చుమ్మ అంటూ ఆమెను అన్నాడు. ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. ఇద్దరు కూడా ఎక్కువ కలిసే ఉండే వారు.

ఒకటి రెండు సార్లు మినహా ఎక్కువ సార్లు కలిసే వీరిద్దరు ఆడారు, పాడారు. అందుకే వీరిద్దరి మద్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఇక బిగ్‌ బాస్‌ నుండి బయటకు వెళ్లగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవినాష్‌ కు ఇంట్లో ఉన్న వారితో చేసిన పని వల్ల పిల్లను ఎవరు ఇవ్వరేమో అంటూ రాహుల్‌ అనుమానం వ్యక్తం చేశాడు. ఇంట్లో వారి అందరితో కేవలం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కోసమే తప్ప నేను అలాంటి వాడిని కాదు అంటూ అవినాష్‌ పేర్కొన్నాడు.
Tags:    

Similar News