స‌ర్కారు వారిలో ఆ స్టార్ సింగ‌ర్ ఫేమ‌స్ సాంగ్!

Update: 2022-04-19 14:30 GMT
ఇటీవలి కాలంలో చాలా మంది బాలీవుడ్ - ఇతర భాషల గాయకులు  టాలీవుడ్ లో  సూపర్ స్టార్ల కోసం కొన్ని సూపర్ హిట్ పాటలు పాడటం తో బాగా  సూపర్ పాపులర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు  సిద్ శ్రీరామ్ ని మంచి  ఉదాహరణ గా చెప్పొచ్చు. ఈ యంగ్ సింగర్ టాలీవుడ్ లో ఎంత ఫేమ‌స్ అయ్యాడంటే..ఈస‌క్సెస్ ని అత‌ను కూడా ఊహించి ఉండ‌డు.  అంత‌గా తెలుగు నాట పాపుల‌ర్ అయ్యాడు.

తాజాగా ఈ  జాబితాలో మ‌రొక సింగ‌ర్  కూడా చేరారు. అత‌నే ఆర్మాన్ మాలిక్. `అలా వైకుంఠపురంలో నుండి "బుట్టా బొమ్మ" పాటతో దక్షిణాదిలో భారీ ఖ్యాతిని పొదాడు  ఆర్మాన్. ఆ పాటకు  ముందు అర్మాన్ `తొలిప్రేమ`లో `నిన్నిలా నిన్నిలా` - `అరవింద సమేత వీర రాఘ‌వ‌`లోని `అనగనగా` వంటి సూపర్‌హిట్ పాటలతో కూడా ప్ర‌శంలందుకున్నాడు. ఇటీవ‌లే  `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌`లో  అత‌ను పాడిన ` గుచే గులాబి` అంతే పెద్ద హిట్ అయింది. శ్రోత‌ల్ని విశేంగా ఆక‌ట్టుకుంది. ఇలా ఈ ప్రతిభావంతుడైన గాయకుడు ఇప్పటివరకు తెలుగులో 30కి ప‌గా పాటలు పాడారు.

తాజాగా  సూప‌ర్ స్టార్  మహేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న  `స‌ర్కారు వారి పాట`లో కూడా అతను మంచి నెంబ‌ర్ ఆల‌పిచారని స‌మాచారం. ఆ పాట సినిమాలో పెద్ద హిట్ అవుతుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి మహేష్ అభిమానులు  అర్మాన్‌కి  సోషల్ మీడియా పేజీలలో పాట గురించి కొన్ని వార్తలను లీక్ చేయడానికి చాలా సందేశాలు పంపుతున్నారు.

ఇలాంటి వేలాది అభ్యర్థనలకు స్పందిస్తూ.. ప్రతిభావంతులైన గాయకుడు ఆ  పాట విడుదల కోసం తాను కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో  వేచి ఉన్నానని పేర్కొన్నారు.  పాటను అధికారికంగా విడుదల చేసే వరకు అంతా స‌హ‌నంగా  వేచి ఉండమని అభిమానులను కోరారు. అతను మహేష్ కోసం ఒక అందమైన మెలోడీని పాడ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని..అభిమానుల‌కు అంద‌రికీ ఆ పాట న‌చ్చుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన క‌ళావ‌తి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

సోష‌ల్ మీడియాలో పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఇదే స‌మ‌యంలో ఇందులో హీరోయిన్ గా న‌టించిన  కీర్తి సురేష్  పైనా నెగిటివిటీ పెద్ద  ఎత్తున  స్ర్పెడ్ అయింది. కీర్తి ఆ నెగివిటీని తొల‌గించే ప‌నిలో ప‌డింది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
Tags:    

Similar News