సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న అర్జున్ రెడ్డి దర్శకుడు
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సెంటిమెంట్ లను ఎక్కువగా నమ్ముతారనే విషయం కాదనలేని నిజం. ఒకసారి సక్సెస్ అయిన ఫిల్మ్ మేకర్స్ తదుపరి సినిమాలకు సక్సెస్ ఫార్ములాను లేదా సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఈయన బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో సెన్షేషన్ సక్సెస్ దక్కించుకున్నా తదుపరి సినిమాకు కొన్ని కారణాల వల్ల కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు 'అనిమల్' అనే సినిమాను రణబీర్ కపూర్ తో సందీప్ ప్రకటించాడు. కొత్త సంవత్సరం కానుకగా సినిమా ప్రకటించేందుకు ఒక వీడియోను విడుదల చేశాడు. అందులోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరిని ఆకర్షిస్తుంది.
సాదారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు స్టార్ మ్యూజిక్ కంపోజర్ లు పని చేస్తూ ఉంటారు. కాని అనిమల్ సినిమా కోసం తనతో అర్జున్ రెడ్డి సినిమా కోసం వర్క్ చేసిన హర్షవర్థన్ ను సందీప్ రెడ్డి వంగా తీసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది అనేది అందరి మాట. అందుకే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అలాగే తన మనసు తెలిసి హర్షవర్థన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇస్తాడని సందీప్ భావిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే హర్షవర్థన్ తోనే అనిమల్ కు బీజీ ఇప్పించబోతున్నాడు. పాటలు బాలీవుడ్ సంగీత దర్శకుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డితో మొదలైన వీరి బంధం మరియు సెంటిమెంట్ అనిమల్ తో మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇటీవల విడుదలైన వీడియోతో అనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.