రహమాన్‌ వారసురాలు అరంగేట్రంకు రెడీ

Update: 2020-07-16 09:30 GMT
ఇండియన్‌ స్క్రీన్‌ పై వారసుల ఎంట్రీ కొత్తేం కాదు. హీరోలు హీరోయిన్స్‌ దర్శకులు నిర్మాతలు ఇలా అన్ని క్రాప్ట్‌ లకు చెందిన వారు ఏదో  రకంగా ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉన్నారు. త్వరలో ప్రముఖ సంగీత దర్శకుడు.. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఏఆర్‌ రహమాన్‌ కూతురు కూడా నటిగా పరిచయం కాబోతుంది. రహమాన్‌ కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రహిమ రహమాన్‌ ఒకరు. ఇతర ఇద్దరితో పోల్చితే రహమ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెట్టడంతో పాటు మీడియాలో కూడా రెగ్యులర్‌ గా కనిపిస్తూనే ఉంటుంది.

ఇప్పటికే తండ్రి వారసత్వంను పునికి పుచుకుని కొన్ని మ్యూజిక్‌ వీడియోలు చేసిన రహిమ త్వరలో నటిగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతోంది. ఇప్పటికే ఈమె నటనలో శిక్షణ పొంది రెడీగా ఉందట. వచ్చే ఏడాదిలో బాలీవుడ్‌ సినిమాతో రహిమ వెండి తెరపై తెరంగేట్రం చేసే అవకాశం ఉందట. రహిమ నటనపై చాలా ఆసక్తిని కనబర్చుతున్నందున కూతురును ఆదిశగా ప్రోత్సహించాలని రహమాన్‌ నిర్ణయించుకున్నాడట. బాలీవుడ్‌ లో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ రహిమను పరిచయం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. తండ్రి సంగీత సామ్రాజ్యంలో వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో కూతురు నటిగా అత్యున్నత శిఖరాలకు చేరుతుందేమో చూడాలి.
Tags:    

Similar News