• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్క ఆయన్ని నమ్మిన...

అనుష్క ఆయన్ని నమ్మిన పాపానికి..

By - Tupaki Desk
Update: 2018-07-01 09:35 GMT
సౌత్ ఇండియాలో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ అనుష్క. ‘అరుంధతి’.. ‘భాగమతి’ లాంటి సినిమాలు ఆమె సత్తా ఏంటో చాటిచెప్పాయి. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘భాగమతి’ లాంటి విజయాలు సాధించినప్పటికీ అనుష్క కెరీర్లో ఇప్పుడంత ఊపు లేదు. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు ఆమెకు. అలాగని అవకాశాలు రాలేదనడానికేమీ లేదు. ఆషామాషీ సినిమాల్ని ఆమె ఒప్పుకోవట్లేదు. తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండాలని.. సినిమాలోనూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే వేరే అవకాశాల్ని విడిచిపెట్టి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పింది. ఆ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చేసి తర్వాత తన దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ నో చెప్పింది.

కానీ గౌతమ్ మీనన్ ప్రతిభావంతుడే కానీ.. ఆయన కొన్నేళ్లుగా తీస్తున్న సినిమాలకు ఏవో తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ఎన్నో ఇబ్బందులు తర్వాత చాలా ఆలస్యంగా రిలీజైంది. ఇక ధనుష్ తో ఆయన తీసిన సినిమా మధ్యలో ఆగిపోయింది. విక్రమ్ హీరోగా మొదలుపెట్టిన ‘ధృవనక్షత్రం’కు కూడా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాల సంగతి తేలితే కానీ.. అనుష్క చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే చాలా నెలలుగా అనుష్క గౌతమ్ కోసం ఎదురు చూసింది. కానీ ఆయన ఎప్పటికి ఫ్రీ అవుతాడో.. తనతో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో తెలియట్లేదు. ఈ స్థితిలో ఇక ఆ సినిమాపై ఆశలు వదిలేసి వేరే ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అనుష్క భావిస్తున్నట్లు సమాచారం. మంచి కథతో ఎవరైనా వస్తే వెంటనే సినిమా మొదలుపెట్టడానికి అనుష్క రెడీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు గ్లామర్ రోల్ చేయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Tags:    
  • Anushka 
  • Gowtham Menon 
  • telugu NEws 

Similar News

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS