స్వీటీ చెంప చెల్లుమనిపించింది

Update: 2015-07-23 09:35 GMT
కొత్తకొత్త ఆలోచనలతో దర్శకరచయితలు సరైన పాత్రల్ని క్రియేట్‌ చేయాలే కానీ, మేం వాటిలో జీవించడానికి అన్నివేళలా సిద్ధంగానే ఉంటామని చెబుతోంది స్వీటీ శెట్టి అలియాస్‌ అనుష్క శెట్టి.

నన్ను అరుంధతిలా చూపించాలన్న ఆలోచన నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి కి వచ్చింది. అందుకే అరుంధతిగా మీ ముందుకు రాగలిగాను. రుద్రమదేవిగా చూపించాలనుకున్నారు గుణశేఖర్‌. అతడి వల్లే ఇప్పుడు రాణీ రుద్రమ గా మీ ముందుకు వస్తున్నా. అంతేనా రాజమౌళి సృష్టి లో యువతరం కలల రాకుమారిగా కనిపించబోతున్నా. బాహుబలి 2లో మీరు ఎవరూ ఊహించనంత అందంగా కనిపిస్తాను. రాకుమారి అంటే ఇలా ఉంటుందా? అనిపించేంత అందంగా కనిపిస్తానని చెప్పింది స్వీటీ. స్వీటీ మాటల్లోని అంతరార్థం మన దర్శనిర్మాతలు గ్రహిస్తే.. ఓ సంగతి అర్థమవ్వాలి. అదేంటంటే...

కథానాయికల్ని ఎలా చూపించాలో మీకు తెలియాలి. ఓ గొప్ప విజన్‌ మీలో ఉంటేనే మమ్మల్ని కొత్తగా చూపించగలరు. అది చేతకాకపోవడం వల్లే ఈరోజుల్లో కథానాయికలు రొటీన్‌గా కనిపిస్తున్నారని దెప్పి పొడిచింది. దీన్నిబట్టి మీకో విషయం అర్థం కావాలి. ఇకనుంచి ఎవరైనా కథలు రాస్తే అనుష్కను కొత్తగా ఎలా చూపించాలా? అని ఆలోచించాలి. చార్లెస్‌ ఏంజిల్‌ లా, క్యాట్‌ ఉమెన్‌ లా, మెలిఫిషియెంట్‌ లా చూపించగలగాలి. అదీ సంగతి.
Tags:    

Similar News