అనుపమతో అందమైన పేజీ క్రియేషన్‌ కు రెడీ

Update: 2020-10-19 05:00 GMT
నిఖిల్‌ హీరోగా సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌2 బ్యానర్‌ లో రూపొందుతున్న 18 పేజేస్‌ మూవీ షూటింగ్‌ చకచక జరుగుతోంది. గత కొన్ని వారాలుగా నిఖిల్‌ మరియు కీలక యూనిట్‌ సభ్యులపై చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ లో తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ కూడా జాయిన్‌ అయ్యింది. ఆమెకు చిత్ర యూనిట్‌ సభ్యులు సాదర స్వాగతం పలికారు. సాదరణంగా అయితే హీరోయిన్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అయితే హడావుడి ఏమీ ఉండదు. కాని ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ జాయిన్‌ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో ఆమెకు సాదర స్వాగతం పలుకుతూ పోస్ట్‌ లు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మలయాళ బ్యూటీ అనుపమ 'ప్రేమమ్‌' సినిమాతో అందరి హృదయాల్లో స్తానం సంపాదించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మడి కెరీర్‌ నిదానంగా సాగుతోంది. కమర్షియల్‌ హిట్స్ వచ్చినా కూడా ఈమెకు తదుపరి సినిమా ఆఫర్‌ కోసం వెయిట్‌ చేయాల్సి వస్తూ ఉంది. పెద్ద హీరోలతో నటించిన తర్వాత కూడా ఈమెకు మళ్లీ చిన్న హీరోల సినిమాల్లో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫర్లు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లకు ఓకే చెబుతోంది. 18 పేజెస్‌ మూవీతో అయినా నటిగా మంచి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుని స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News