'ఎఫ్ 3' లో మరో ముగ్గురు హీరోయిన్లు..?
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మల్టీస్టారర్ 'ఎఫ్ 2'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3' ని తెరకెక్కించనున్నారు. ఇటీవలే దీని గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి మోర్ ఫన్ యాడ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో 'ఎఫ్ 2' మెంబెర్స్ కొనసాగుతూనే మరికొంతమంది కొత్తవాళ్ళు యాడ్ అవుతారని తెలుస్తోంది.
'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్' లో అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా - మెహరీన్ 'ఎఫ్ 3' లో కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే మోర్ ఫ్రస్టేషన్ తో రాబోతున్న ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లకి స్థానం కలిగిస్తున్నారట. ఇందులో పాయల్ రాజ్ పుత్ - రాశీఖన్నా లు కూడా నటిస్తున్నారట. అంతేకాకుండా లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గెస్ట్ అప్పీరియన్స్ చేస్తోందట. రష్మిక ఇంతకముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 'ఎఫ్ 3' లో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనేది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.