క్రేజీ కాంబోలో మరో మూవీ

Update: 2019-04-22 08:14 GMT
కథల ఎంపికలో విలక్షణత చూపిస్తూ ప్రతి కొత్త సినిమాలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్న తమిళ వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మరో క్రేజీ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టాడు. కమల్ హాసన్ కూతురు సౌత్ హీరోయిన్ శృతి హాసన్ తో మొదటిసారి జట్టు కడుతున్నాడు. దీనికి సంబందించిన పూజా కార్యక్రమలు ఇవాళ జరిగాయి.

రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ అంబసముద్రంలో మొదలుకాబోతోంది. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు లాభం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు వెర్షన్ తాలూకు డీటెయిల్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇందులో విజయ్ సేతుపతి సామాజిక సమస్యల మీద పోరాడే రైతుగా కనిపిస్తాడు

శృతి హాసన్ విషయానికి వస్తే తను ఇందులో సింగర్ కం డాన్సర్ గా నటిస్తోంది. ఈ రూపకాల ద్వారా జనంలో చైతన్యం తీసుకువచ్చేలా తన పాత్రను డిజైన్ చేశారు. ఎస్పి జననాథన్ దర్శకుడు. ఇంతకు ముందు ఇతను విజయ్ సేతుపతితో పురంపొక్కు ఎంగిర పొత్తుఉదమై అనే సినిమా చేశాడు . అది మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఇది కూడా అదే తరహలో సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ గా సాగుతుందని టీం చెబుతోంది. గత ఏడాది కాలంగా  సినిమాలు ఒప్పుకోకుండా సైలెంట్ గా ఉన్న శృతి హసన్ ఇంత గ్యాప్ తర్వాత సెట్ లోకి అడుగు పెట్టింది. జగపతి బాబు మెయిన్ విలన్ గా చేస్తుండటం మరో విశేషం 
Tags:    

Similar News