రాజు గారి జడ్జిమెంట్ ఏమైంది ?
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కి సినిమా విజయాన్ని అంచనా వేయడంలో మంచి పట్టుంది. నిజానికి దిల్ రాజు మంచి ఎడిటర్ అని ఏ సన్నివేశానికి బాగా రెస్పాన్స్ వస్తుందో ...దేనికి ఆడియన్స్ రియాక్షన్ ఉండదో యిట్టె చెప్పేస్తాడనే టాక్ ఉంది. అందుకే రాజు గారు అన్ని విజయాలు అందుకుంటున్నారు. ఇది ఒకప్పటి మాట. అవును ఇప్పుడు రాజు గారి జడ్జిమెంట్ మీద ప్రేక్షకుల కు చాలా అనుమానాలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే థియేటర్స్ లో వాలిపోయే ప్రేక్షకుల కు కొన్ని నెలలుగా రాజు గారి నుండి వస్తున్న డిజాస్టర్ సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి.
నిజానికి రాజు గారు కథలకు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో సినిమా అవుట్ పుట్ చూసి కూడా అంతే ఎగ్జైట్ అవుతున్నారట. అదే సినిమా రిజల్ట్ పై దేబ్బెస్తుందని అంటున్నారు. అయితే గతేడాది నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా తీసి దాన్ని మరో బొమ్మరిల్లు అని చెప్పుకోవడం రాజు గారి జడ్జిమెంట్ మీద నమ్మకం పోయేలా చేసింది. ఇక మహర్షి కూడా ఒక గొప్ప కళాకండం అన్నటుగా పదే పదే చెప్పాడం కూడా ప్రేక్షకుల్లో రాజు గారి మీదున్న నమ్మకం పోయేలా చేసింది. నిజానికి మహర్షి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా కష్టం అయింది. మెజారిటీ జనాలకు సినిమా అంతగా ఎక్కలేదు. మిగతా వారికి కూడా క్లైమాక్స్ ఒక్కటే నచ్చింది.
ఇక ఇవే కాదు రాజ్ తరుణ్ తో గతేడాది తీసిన 'లవర్', ఇటివలే తీసిన 'ఇద్దరి లోకం ఒకటే' కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా పడ్డాయి. ఇక పై అయినా రాజు ఆయన బ్యానర్ సినిమాలపై ఎగ్జైట్ మెంట్ తగ్గించుకొని సాదారణ ప్రేక్షకుడి గా ఆలోచించి తన జడ్జిమెంట్ తో మళ్ళీ పూర్వ వైభవం అందుకుంటారేమో చూడాలి.