మతం వివాదంలో కేసు రద్దు చేయాలంటూ హైకోర్టుకు కంగన!!
మత ఉద్రిక్తతను పెంచే లక్ష్యంతో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ రోజు.. రేపు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కంగన రనౌత్, .. ఆమె సోదరి రంగోలి చందేల్ పై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సిస్టర్స్ కి వ్యతిరేకంగా నమోదు చేసిన మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ను రద్దు చేయాలని తాజాగా ముంబై హైకోర్టుకు నివేదించింది కంగన.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. కంగన- రంగోలి వివాదాస్పద మత వ్యాఖ్యలపై వారి కాస్టింగ్ డైరెక్టర్ ఫిట్నెస్ ట్రైనర్ ముంబైలో పోలీస్ కేసు నమోదు చేయగా విచారణ మొదలైంది. అక్టోబర్ 26 ..అక్టోబర్ 27 న అలాగే నవంబర్ 9 - 10 తేదీలలో సోదరీమణులను పోలీసులు రెండుసార్లు పిలిచారు. కాని వారు పోలీసుల ముందు హాజరుకాలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 15 వరకు తమ సోదరుడి వివాహంలో బిజీగా ఉన్నామని తమ న్యాయవాది ద్వారా సిస్టర్స్ చెప్పారు.
ముంబై పోలీసులు కంగనా రనౌత్- రంగోలి చందేల్ లను ప్రశ్నించడానికి హాజరుకావాలని ఆదేశించినా.. అది పట్టించుకోలేదు. ఇదేగాక.. తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ వైరి వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తూ సోదరీమణులపై కాస్టింగ్ డైరెక్టర్.. ఫిట్ నెస్ ట్రైనర్ మునావవర్ అలీ సయ్యద్ ఫిర్యాదుపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
``కంగన సిస్టర్స్ ప్రజల మనస్సులలో బాలీవుడ్ కి బ్యాడ్ ఇమేజ్`` ను సృష్టించారని .. తన ట్వీట్లలో మతాన్ని తీసుకువచ్చారని మునవర్ అలీ ఆరోపించారు. ముంబై బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.
33 ఏళ్ల కంగన ఆమె సోదరిపై దేశద్రోహంతో ఎఫ్ఐఆర్ (మొదటి సమాచార నివేదిక) లో అభియోగం నమోదైంది. మతం జాతి ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేశారని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆ ఇద్దరు సిస్టర్స్ పై కేసు నమోదు చేశారు.
కంగనా రనౌత్ తన రిహార్సల్స్ .. షూట్స్ గురించి..తదుపరి సినిమా ప్రాజెక్టులైన `ధాకాడ్`.. `తలైవి`కి సంబంధించిన ఫోటోలతో పోస్ట్ చేసి తప్పించుకోజూశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దర్యాప్తుపై ఆమె చేసిన విమర్శలపైనా ముంబై పోలీసులు.. మహారాష్ట్ర ప్రభుత్వాలకు కంగన శత్రువుగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో ప్రజలకు రక్షణ లేదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అని వ్యాఖ్యానించడం వేడెక్కించింది. మహారాష్ట్ర- ముంబైని వివాదాస్పద పీవోకేతో పోల్చడం గొడవకు దారితీసింది. దీనికి ప్రతీకారంగా ముంబై లో కంగన కార్యాలయం కూల్చివేత ఘటన హీట్ పెంచింది. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది.