ఎన్టీఆర్ సినిమాలే రెఫరెన్సంటున్న విలన్

Update: 2017-02-21 09:02 GMT
ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎందరో గొప్ప నటులున్నారు. వాళ్లందరూ అనేక రకాల జానర్లలో సినిమాలు చేశారు. ఐతే ఎవరు ఎన్ని జానర్లు ప్రయత్నించినా.. ఎంతగా మెప్పించినా.. పౌరాణికాల దగ్గరికి వచ్చేసరికి నందమూరి తారకరామారావును మించిన నటుడు మరొకరు లేదన్నది స్పష్టం. ఈ సంగతి వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఎన్నెన్నో అద్భుతమైన పౌరాణిక పాత్రలతో మెప్పించారు ఎన్టీఆర్. ఈ తరం బాలీవుడ్ నటులకు సైతం పౌరాణికాల విషయంలో ఎన్టీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని.. ఆయన సినిమాలే వారికి రెఫరెన్స్ అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

‘ఎస్-3’ సినిమాతో విలన్ గా దక్షిణాదికి పరిచయమైన అనూప్ సింగ్ ఠాకూర్.. ఒక దశలో అదే పనిగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు చూశాడట. మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన అనూప్ సింగ్.. హిందీలో తెరకెక్కిన మెగా సీరియల్ ‘మహాభారతం’లో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర చేసే ముందు తెలుగులో ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూడమని అతడికి సలహాలిచ్చారట. దీంతో వాళ్లు చెప్పినట్లే ఎన్టీఆర్ సినిమాలు చాలా చూశానని.. అవి తనకు రెఫరెన్సుగా చాలా బాగా ఉపయోగపడ్డాయని.. ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని అనూప్ చెప్పాడు. ఎస్-3తో మెప్పించిన అనూప్ సింగ్.. సాయిధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్’లోనూ విలన్ పాత్ర చేస్తున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న ‘రోగ్’లోనూ సైకో విలన్ క్యారెక్టర్ చేశాడు. మున్ముందు తెలుగులో అతను మరింత బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News