సైలెంట్ అయిపోయిన అన్న‌పూర్ణ బ్యాన‌ర్..!

Update: 2021-02-13 10:30 GMT
తెలుగులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది 'అన్నపూర్ణ స్టూడియోస్'. అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'శివ' 'మన్మథుడు' 'సత్యం' 'మాస్' 'నిన్నే పెళ్లాడతా' 'సూపర్' 'ఉయ్యాల జంపాల' 'మనం' 'ఒక లైలా కోసం' 'సోగ్గాడే చిన్ని నాయనా' 'రారండోయ్ వేడుక చూద్దాం' 'హలో' వంటి సినిమాలు వచ్చాయి. అయితే కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీసే అన్నపూర్ణ ప్రొడ‌క్ష‌న్ హౌస్.. అన్నపూర్ణ స్టూడియో ఉన్నంత బిజీగా లేదని టాక్ నడుస్తోంది.

అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'మన్మథుడు 2' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అప్పటి నుంచి ఈ బ్యానర్ లో మరో సినిమా రాలేదు. మధ్యలో 'లూజర్' అనే వెబ్ సిరీస్ లో భాగస్వామ్యం అయినప్పటికీ.. మరో కొత్త ప్రాజెక్ట్ ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూసుకువెళ్తున్నారు. అన్నపూర్ణ వారు మాత్రం సైలెంటుగా ఉంటున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

నిజానికి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమా చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. హోమ్ ప్రొడక్షన్ లో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేయాల్సి ఉంది. ఎప్ప‌టి నుంచో ఈ సినిమా ఉంటుంద‌ని ఊరిస్తూ వ‌స్తున్నారు. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కూడా అలానే ఈ బ్యాన‌ర్ నే న‌మ్ముకుని ఆ కాంపౌండ్ లోనే మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇంత వరకు 'బంగార్రాజు' సినిమాపై క్లారిటీ రావడం లేదు. మరి త్వరలోనే దీనిపై ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చి ఈ వార్తలకు ముగింపు పలుకుతారేమో చూడాలి.

Tags:    

Similar News