నువ్వు నేను అనిత.. ఇప్పుడిలా..

Update: 2016-02-26 11:33 GMT
నువ్వు నేను.. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ అనితలను సినిమా ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. 15 ఏళ్ల క్రితం ఈ మూవీ విడుదలైంది. ఈ భామ ఇప్పటికీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషమే. ముందు యాడ్స్, తర్వాత తెలుగు, ఆ తర్వాత హిందీ.. నెక్ట్స్ కన్నడ - తమిళ సినిమాలు చేస్తూ.. బాగానే కెరీర్ కంటిన్యూ చేసింది.

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ భామ కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. అయినా సరే సినిమాలను మాత్రం కొనసాగించడం విశేషం. చివరగా జీనియస్ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ తర్వాత తెలుగులో కనిపించని అనిత.. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం చేజిక్కించుకుంది. అయితే.. ఇదేమీ క్రేజీ ఆఫర్ కాదులెండి. ఆర్పీపట్నాయక్‌ హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ 'మనలో ఒకడు' అనే సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా.

మీడియానే కథాంశంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనిత నటిస్తోంది. ఆర్పీ ట్యాలెంట్ ని తక్కువ చేసి మాట్లాడలేం కానీ... హీరోయిన్ గా కంటిన్యూ అవడం కోసం.. అన్ని ఆఫర్లని ఒప్పేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనితని చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ మూవీ తర్వాత అనిత తీసుకోబోయే టర్న్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News