హాట్‌ యాంకర్‌ మరోసారి నెగటివ్‌ షేడ్స్‌

Update: 2020-07-21 10:10 GMT
హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఇక్కడ సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ ఎనర్జి మరియు ఆమె అందంకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అద్బుతమైన ఎనర్జితో ఆమె చేసే యాంకరింగ్‌ మరియు తన హాట్‌ లుక్స్‌ తో జనాలను ఆకట్టుకోవడంతో ఆమెకు హీరోయిన్‌ స్థాయిలో స్టార్‌ డం దక్కింది. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది.

గతంలో ఒక సినిమాలో నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను చేసిన అనసూయ మళ్లీ కొంత గ్యాప్‌ తీసుకుని రంగమార్తాండలో కూడా నెగటివ్‌ రోల్‌ ను పోషించింది. ఇంతకు ముందు నెగటివ్‌ రోల్‌ ను సినిమాలో కొద్ది సమయం పాటే అనసూయ చేసింది. కాని రంగమార్తాండలో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ నెగటివ్‌ రోల్‌ లో అనసూయ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరాఠీలో సక్సెస్‌ అయిన సినిమాను కృష్ణవంశీ రంగమార్తాండగా రీమేక్‌ చేస్తున్నాడు.

గత కొంత కాలంగా కృష్ణవంశీ నిరాశ పర్చుతూ వస్తున్నాడు. అందుకే ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ద పెట్టి తెరకెక్కిస్తున్నాడు. ప్రకాష్‌ రాజ్‌ రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్‌ ల చిన్న కూతురు శివాత్మిక మరియు రాహుల్‌ సిప్లిగంజ్‌ లు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News