నువ్వు ఎవడివిరా అంటూ అతడిపై అనసూయ ఫైర్‌

Update: 2020-05-16 04:45 GMT
తెలుగు బుల్లి తెర హాట్‌ జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే విషయం తెల్సిందే. ప్రతి సందర్బానికి అనుసారంగా అనసూయ సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. నిన్న అనసూయ బర్త్‌ డే అనే విషయం తెల్సిందే. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న అనసూయ ఆ తర్వాత తన అభిమానులతో కూడా పుట్టిన రోజును సంతోషాన్ని లైవ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది.

ఇన్‌ స్టాగ్రామ్‌ లైవ్‌ లోకి వచ్చిన అనసూయ అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన దక్కించుకుంది. వేలాది మంది అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఎప్పటిలాగే ఈమెను కొందరు చిరాకు పెట్టారు. గతంలో సోషల్‌ మీడియాలో పలు సార్లు అనసూయ బ్యాడ్‌ కామెంట్స్‌ ను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి కూడా ఆమె బ్యాడ్‌ కామెంట్స్‌ ను ఎదుర్కొంది.

లైవ్‌ లోకి వచ్చిన అనసూయ కాస్త మోడ్రన్‌ గా డిజైనర్‌ డ్రస్‌ ను వేసుకుంది. దాంతో ఒక నెటిజన్‌ నీవు ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయాన్ని మర్చి పోయావా.. కాస్త పద్దతిగా డ్రస్‌ వేసుకోవచ్చు కదా అంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌ పై అనసూయ సీరియస్‌ అయ్యింది. ఇలాంటి వాళ్ల వళ్లే వాడు వీడు అనే పదాలు వస్తాయి. నువ్వు ఎవడివిరా నా డ్రస్‌ గురించి మాట్లాడటానికి.. అమ్మ అయితే ఆ డ్రస్‌ వేసుకోవాలి ఈ డ్రస్‌ వేసుకోకూడదు అనే రూల్‌ ఉంది. అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా.

అమ్మ ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవడివిరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పుట్టిన రోజున నాతో తిట్లు తినాలనుకున్నావా అంది. అమ్మ అంటే తన లైఫ్‌ కొనసాగిస్తూ మరొకరికి లైఫ్‌ ఇస్తుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఉండాలి. ఆ విషయాన్ని నీవు ఎవడివిరా చెప్పేందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:    

Similar News