టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న పూరీ హీరోయిన్...!

Update: 2020-07-21 09:50 GMT
బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే వారసురాలిగా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అనన్య పాండే. తన అందాలతో ఫస్ట్ సినిమాతోనే సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. వెంటనే 'పతీ పత్నీ ఔర్ ఓహ్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ దేవరకొండ కాంబినేషన్ లో మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళం తోపాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరీ జగన్నాథ్ - నటి చార్మ్ కౌర్ - కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు అనన్య పాండే పేరు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కొత్త సినిమాల‌కి ఎక్కువగా రెఫర్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్న ఈ బ్యూటీతో పూరీ క‌నెక్ట్స్ అగ్రిమెంట్ చేసుకుందట. అందుకే ఇప్పుడు ఛార్మీ అండ్ టీమ్ ఈ బ్యూటీ కోసం తెలుగులో ఆఫర్స్ తెచ్చే ప‌నిలో ప‌డ్డార‌ని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ మధ్య అన‌న్య పాండే పేరు బాగా వినిపించడానికి కారణం పూరీ అండ్ ఛార్మీ టీమ్ అని చర్చించుకుంటున్నారు. కాగా పూరీ సినిమాల్లో హీరోయిన్స్ అంటే అందాల ఆరబోతతో పాటు నటించే స్కోప్ కూడా ఉంటుంది. మరి అమ్మడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టాలీవుడ్ లో పాతుకుపోతుందేమో చూడాలి.
Tags:    

Similar News