కొత్త లుక్ తో షాక్ ఇచ్చిన బిగ్ బీ!

Update: 2019-06-21 09:51 GMT
బాలీవుడ్ లో ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నా.. ఎంతమంది బడా స్టార్లు ఉన్నా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్థానం మాత్రం ప్రత్యేకమైందే.  76 ఏళ్ళ వయసులో ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ఛాలెంజింగ్ పాత్రల్లో ఉత్సాహంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈమధ్యే తాప్సీ తో కలిసి అమితాబ్ 'బద్లా' అనే సూపర్ హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  బద్లాలో అడ్వొకేట్ గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది.  తాజాగా ఆయన 'గులాబో సితాబో' మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో అమితాబ్ పాత్రకు సంబంధించిన లుక్ ను తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.  ఈ సినిమాలో బిగ్ బీ ఒక వయసుమళ్ళిన ముస్లిం పాత్రలో నటిస్తున్నారు.  లూజ్ గా ఉండే లాల్చీ.. గుబురుగా పెరిగిన గడ్డం.. లావుపాటి కళ్ళజోడు..  తలకు టోపీ ధరించి.. పైనేమో ఒక టవల్ చుట్టుకొని డిఫరెంట్ గెటప్ లో ఉన్నారు.  ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుండే ప్రారంభం అయిందని సమాచారం.

కామెడీగా సాగే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున ఈ సినిమాకు షుజిత్ సర్కార్ దర్శకుడు.  టాలెంటెడ్  హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రోనీ లాహిరి.. షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల చేస్తారట.  ఇదిలా ఉంటే అమితాబ్ రీసెంట్ గా 'చెహెరే' అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
Tags:    

Similar News