ఒకే యుద్ధంలో ఇద్దరు టాలీవుడ్ హీరోలు

Update: 2017-01-22 04:04 GMT
బయోపిక్ ల సీజన్ ఇప్పుడు విపరీతంగా నడుస్తోంది. రియల్ లైఫ్ కథలను ఆడియన్స్ తెగ ఆదరించేస్తున్నారు. బయోపిక్ లలో యుద్ధాల ఆధారంగా వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే.. ఒకే యుద్ధమో.. ఒకే కథతోనో సినిమాలు రావడం సహజమే. కానీ ఒకేసారి ఒకే యుద్ధంపై రెండు సినిమాలు తెరకెక్కడం మాత్రం ఇదే మొదటిసారి.

ఘాజీ అంటూ దగ్గుబాటి రానా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇండియాలోనే మొదటి సబ్ మెరైన్ మూవీగా చరిత్రలో నిలిచిపోనుంది కూడా. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఇదే 1971 ఇండో-పాక్ యుద్ధంపై మరో చిత్రం మలయాళంలో రూపొందుతోంది.

1971 బియాండ్ బోర్డర్స్ అనే టైటిల్ పై మలయాళంలో రూపొందుతున్న చిత్రంలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. రానా నటించిన ఘాజీ మూవీ విశాఖ దగ్గరలో సముద్ర గర్భంలో జరిగిన సంఘటనల సమాహారం కాగా.. అల్లు శిరీష్ సినిమా మాత్రం బోర్డర్ దగ్గర జరిగిన వాస్తవాలకు రూపం. ఇప్పటికే ఘాజీ రిలీజ్ కి రెడీ అయిపోగా.. అల్లు శిరీష్ మల్లు సినిమా విడుదల అయేందుకు ఇంకా తగినంత సమయం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News