అల్లు బ్రదర్‌ మొదటి సినిమా అప్‌ డేట్స్‌

Update: 2019-09-28 06:55 GMT
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అల్లు బ్రదర్స్‌ అల్లు అర్జున్‌.. అల్లు శిరీష్‌ లు హీరోలుగా ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ టాలీవుడ్‌ టాప్‌ హీరోల జాబితాలో ఉన్నాడు. అల్లు శిరీష్‌ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఆయన కెరీర్‌ లో నిలదొక్కుకుంటున్నాడు. ఈ సమయంలోనే అల్లు బాబీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. ఈయన అల్లు అర్జున్‌.. శిరీష్‌ ల కంటే పెద్ద వాడు. సినిమాల వైపు కాకుండా వ్యాపారం వైపు ఈయన అడుగులు వేశాడు.

ఇప్పుడు బాబీ సినిమాలపై ఆసక్తి చూపుతున్నాడు. మొదట బాబీ నిర్మాతగా ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో బాబీ ఒక చిత్రంను నిర్మించబోతున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ తో కలిసి బాబీ నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు.
Read more!

వరుణ్‌ తేజ్‌ 'గద్దలకొండ గణేష్‌' చిత్రం ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్‌ రెండవ లేదా మూడవ వారంలో ఆయనతో ఈ కొత్త సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఒక వైపు నిర్మాతగా కొనసాగుతూనే మరో వైపు నటుడిగా కూడా బాబీ ప్రయత్నించాలని కోరుకుంటున్నాడు. తమ్ముళ్ల ఇద్దరిలా హీరోగా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ను కొనసాగించాలని బాబీ ఆశ పడుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బాబీ వచ్చే ఏడాది కెమెరా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News