ఆ తమిళ హిట్ రీమేక్ లో అల్లు అర్జున్

Update: 2018-11-16 07:44 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గరించి 'టాక్సీవాలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు అడుగుతూ గోల చేస్తే 'తెలీదు బ్రదర్' అని చెప్పి తప్పించుకున్నాడు గానీ త్రివిక్రమ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఆ సినిమా ఎంతవరకూ వచ్చిందో ఇంకా తెలీదుగానీ అంతలో అల్లు అర్జున్ సినిమా గరించి ఫిలిం నగర్లో మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

ఈమధ్య తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన చిత్రం '96' విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రేక్షకాదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.  టీవీ లో ప్రసారం అయిన తర్వాత కూడా థియేటర్లలో మంచి కలెక్షన్స్ నమోదు చేస్తూ సంచలనం సృష్టించింది.  ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారట. స్టైలిష్ స్టార్ ఈమధ్యనే ఈ సినిమాను చూసి మనసు పారేసుకున్నారట. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉండడంతో '96' దర్శకుడు ప్రేమ్ కుమార్ ను దిల్ రాజు లైన్లోకి తీసుకొచ్చాడట.

తెలుగు నేటివిటీకి  సూటయ్యేలా కొన్ని మార్పులు చేయమని ప్రేమ్ కుమార్ కు చెప్పాడట అల్లు అర్జున్.  అంతా సవ్యంగా జరిగితే స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా ఇదే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.  కానీ అధికారక ప్రకటన వచ్చే వరకూ మాత్రం ఇది స్పెక్యులేషన్ కిందే లెక్క.


Tags:    

Similar News