తన ఓల్డెస్ట్‌ ఫ్రెండ్‌ కు బన్నీ బర్త్‌ డే విషెష్‌

Update: 2020-10-08 07:00 GMT
అల్లు అర్జున్‌ మరియు దర్శకుడు మారుతిల మద్య పరిచయం స్నేహం ఇప్పటిది కాదు. వీరిద్దరు కూడా సినిమా రంగ ప్రవేశం చేయక ముందు నుండే ఒక మల్టీమీడియా కోర్సు చేసే సమయంలో పరిచయం అయ్యి స్నేహితులుగా మారారు. అప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. మారుతి తన ప్రతిభతో మెల్ల మెల్లగా టాలీవుడ్‌ లో మంచి పేరున్న దర్శకుడిగా మారాడు. కెరీర్‌ ఆరంభంలో బూతు చిత్రాల దర్శకుడు అంటూ పేరు దక్కించుకున్నా భలే భలే మగాడివోయ్‌ సినిమా తర్వాత పూర్తి స్థాయి ఫ్యామిలీ డైరెక్టర్‌ గా మారిపోయాడు.

మారుతి నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు ఎదురు చూసే రేంజ్‌ లో మారుతి పేరు దక్కించుకున్నాడు. ఈయన చివరగా ప్రతి రోజు పండుగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం తదుపరి సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. నేడు మారుతి పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియాలో ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మారుతికి బన్నీ నుండి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. నా ఓల్డెస్ట్‌ ఫ్రెండ్‌ మారుతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. స్నేహితుడు అయిన మారుతికి బన్నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అల్లు అర్జున్‌ బర్త్‌ డే శుభాకాంక్షలకు మారుతి స్పందిస్తూ.. థ్యాంక్యూ బన్నీ బాబు.. సో స్వీట్‌ ఆప్ యూ అంటూ ట్వీట్‌ చేశాడు. మారుతికి ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:    

Similar News