షాకింగ్: 14 కాల్షీట్ల‌కు 9కోట్లు అందుకున్న న‌టి!

Update: 2022-01-13 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` తో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సంగ‌తి  తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పోషిస్తోన్న సీతారామ‌రాజు స‌తీమ‌ణి సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే ఆ పాత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ ట్రైల‌ర్ల‌లోనూ మురిపించింది ఆలియా. సీత పాత్ర‌లో అలియా భ‌ట్ ఆహార్యం చ‌క్క‌గా కుదిరింది. మ‌రి అలియాని ఇలా సీత పాత్ర కోసం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి క‌న్విన్స్ చేయ‌డం కూడా క‌ష్టంగానే మారింది. బాలీవుడ్ లో అలియా బిజీ న‌టి. ఆమె చేతిలో అప్ప‌టికే చాలా సినిమాలున్నాయి. పైగా టాలీవుడ్ లో సినిమా చేయ‌డం అంటే? ఇబ్బందిక‌ర‌ స‌న్నివేశంలో ఉంది ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ.

ఈ నేప‌థ్యంలో జ‌క్కన్న ఆమెను ఒప్పించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.  సీత పాత్ర కోసం అలియా భ‌ట్ ఏకంగా 9 కోట్లు ఛార్జ్ చేసిందిట‌. సినిమాలో ఆ పాత్ర నిడివి కూడా చాలా చిన్న‌ది. కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే అలియా భ‌ట్ తెర‌పై క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం అలియా 12 నుంచి 14 రోజులు స‌మ‌యం మాత్ర‌మే కేటాయించిందిట‌. అంటే అలియా భ‌ట్ పాత్ర నిడివి త‌క్కువే అయినా ఉన్నంత సేపు ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. అంత ప్రాముఖ్య‌త ఉంది కాబ‌ట్టే జ‌క్క‌న్న 9 కోట్లు ఇచ్చి మ‌రి బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసారు. అంతేకాదు ఆలియా కు బాలీవుడ్ లో ఉన్న స్టార్ డ‌మ్ కూడా ఆర్.ఆర్.ఆర్ హిందీ వ‌సూళ్ల‌కు ప్ల‌స్ అనే లాజిక్ కూడా ఇంత పేమెంట్ చెల్లించ‌డానికి కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోషిస్తోన్న కొమ‌రం భీమ్ పాత్ర‌కు జోడిగా హాల‌వుడ్ న‌టి ఒలివియో మోరిస్ న‌టిస్తోంది. మ‌రి ఈ బ్యూటీకి ఎంత చెల్లించారు?  పాత్ర లెంగ్త్ ఎంత‌?  అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న రిలీజ్ అవ్వాల్సి ఉండ‌గా.. ఆర్.ఆర్.ఆర్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఓమిక్రాన్ వైర‌స్ ఉధృతి కార‌ణంగా రాజ‌మౌళి సినిమా  వాయిదా వేసారు. ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ ఇత్రాన్ని డి.వి.వి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఎం. ఎం కీర‌వాణి సంగీతం అందించారు.
Tags:    

Similar News