#RRR భ‌న్సాలీ మోజులో ద‌ర్శ‌క‌ధీరుడికే హ్యాండిచ్చిందా?

Update: 2020-10-07 05:15 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి RRR పెండింగ్ షూట్ పూర్తి చేసి ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ ని శ‌ర‌వేగంగా రెడీ చేసేయాల‌ని ఎంత ఆత్ర‌ప‌డుతున్నారో తెలిసిందే. ఊహించ‌ని మ‌హ‌మ్మారీ అన్నిటికీ చెక్ పెట్టేసింది. ఎట్ట‌కేల‌కు  RRR తిరిగి సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు ఏడు నెలల తర్వాత వారు తిరిగి షూటింగ్ ప్రారంభించడంతో చిత్రనిర్మాత దాన‌య్య‌ ఆ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు.  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ త‌దిత‌ర‌ ప్రధాన తారాగణం తిరిగి సెట్లలోకి రాగా.. మరికొందరు నటీన‌టులు ఇంకా చేరలేదు. వారిలో ఒకరు ప్రధాన నాయిక‌.. సీత పాత్ర‌ధారి అలియా భట్. అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్ )తో కీల‌క స‌న్నివేశాల్లో న‌టించాల్సి ఉంది. ఎప్ప‌టికి టీమ్ తో జాయిన్ అవుతుంది త‌ను అంటే.. నవంబర్ మొదటి వారంలో టీమ్ తో చేరనున్నట్లు తాజాగా ఆలియా ఓ జాతీయ మీడియాకు తెలిపింది.

అలియా ప్రస్తుతం ముంబైలో సంజయ్ లీలా భన్సాలీ `గంగూబాయి కతియావాడి` షూటింగ్ ‌లో బిజీగా ఉంది. అక్క‌డ రోజువారీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే.. అలియా తన మొదటి తెలుగు చిత్రం కోసం కోచ్ ని నియ‌మించుకుని మ‌రీ భాష‌ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఆర్.‌ఆర్.‌ఆర్‌లో సీత పాత్రను పోషిస్తున్న అలియా.. తెలుగులో తన వెర్ష‌న్ కి డబ్బింగ్ చేప్ప‌డానికి ఆసక్తిగా ఉందిట‌. ఇప్ప‌టికే స్థానిక ట్యూటర్ ని ఏర్పాటు చేసుకుని చాలా క‌ఠినంగా క‌ష్టిస్తోంద‌ట‌. గంగూబాయి కతియావాడి ముంబై షూటింగ్ పూర్త‌య్యాక‌.. ఆర్.ఆర్.ఆర్ కోసం పూర్తిగా బ‌రిలో దిగుతుంద‌ట‌.  తెలుగు సినిమాల్లోకి ప్రవేశించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని భాష‌ను నేర్చుకుంటోంది.

అలియాతో పాటు RRR లో అజయ్ దేవ‌గ‌న్ మ‌రో కీల‌క‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయ‌న‌పై ఇప్పటికే కీల‌క షెడ్యూల్ ని జ‌క్క‌న్న చిత్రీకరించాడు. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న‌ డ్రామాలో దేవ‌గ‌న్ .. ఆలియా పాత్ర‌లు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని దేశ విదేశాల్లో జనవరి 2021 లో విడుద‌ల చేయాల‌నుకున్నా.. లాక్ డౌన్ వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేదు ఇప్పుడు అది 2021 వేసవిలో విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్. అందుకు త‌గ్గ‌ట్టు ప‌నుల్లో వేగం పెంచార‌ట జ‌క్క‌న్న‌. ఆలియా మాత్రం భ‌న్సాలీ కోసం తన కాల్షీట్ల‌ను RRR కి ఇవ్వ‌కుండా ఆల‌స్యం చేసిందా? అన్న గుస‌గుస‌లు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో వేడెక్కిస్తున్నాయి.
Tags:    

Similar News