చరణ్‌ ఛాలెంజ్‌ ను ఒప్పుకుంటున్న కాని..

Update: 2020-11-09 04:45 GMT
టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్‌ ప్రముఖులు పలువురు భాగస్వామ్యులు అయ్యారు. ఆమద్య ప్రభాస్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించి మొక్క నాటి రామ్‌ చరణ్‌ ను నామినేట్‌ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్‌ ను కాస్త ఆలస్యంగా స్వీకరించిన రామ్‌ చరణ్‌ ఇటీవల ఎంపీ సంతోష్‌ కుమార్‌ తో కలిసి మొక్క నాటాడు. ఈ సందర్బంగా ఆయన ఆలియా భట్‌ మరియు రాజమౌళిలను నామినేట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం తాను ఎవరితో అయితే వర్క్‌ చేస్తున్నాడో వారికే ఈ ఛాలెంజ్‌ ను విసరడం జరిగింది. చరణ్‌ ఛాలెంజ్‌ కు వెంటనే ఆలియా స్పందించింది.

ఈ ఛాలెంజ్‌ కు నన్ను నామినేట్‌ చేసినందుకు కృతజ్ఞతలు చరణ్‌. లాక్‌ డౌన్‌ టైం లో నేను చాలా మొక్కలు నాటాను. వాటితో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను లాక్ డౌన్‌ టైం లో మొక్కలు నాటిన ఫొటోలు లేవు. కాని మళ్లీ మొక్క నాటుతాను. అంతుకు ముందు నేను ముగ్గురిని నామినేట్‌ చేయాలనుకుంటున్నాను అంటూ శ్రద్దా కపూర్‌.. దియా మిర్జా.. భూమి పెడ్నేకర్‌ లను నామినేట్‌ చేసింది. మొక్కలు నాటకుండానే ఇలా ముగ్గురిని నామినేట్‌ చేయడం ఏంటీ ఆలియా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ టైమ్‌ లో నువ్వు మొక్కలు నాటి ఉంటే ఇప్పుడు నాటే ఉద్దేశ్యం లేదా ఏంటీ.. మొక్కలు నాటిన తర్వాత ఎవరైనా ఛాలెంజ్‌ చేస్తారు. కాని నీ పద్దతి విభిన్నంగా ఉందే అంటూ ఆమెపై కొందరు కౌంటర్‌ లు వేస్తున్నారు.
Tags:    

Similar News