• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘2.0’ విడుదల తేదీపై...

‘2.0’ విడుదల తేదీపై అతనేమన్నాడంటే..

By - Tupaki Desk
Update: 2017-11-08 07:31 GMT
శంకర్-రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘2.0’ వాయిదా అంటూ పది రోజుల కిందట ఒక బాంబు పేలింది. ఐతే నిజంగా ఆ సినిమా వాయిదా పడనుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకసారి వాయిదా అని.. ఇంకోసారి అలాంటిదేమీ లేదని పీఆర్వోలు.. మీడియా వాళ్లు వార్తలు ఇచ్చారు కానీ.. ‘2.0’ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వాళ్లు సైలెంటుగా వినోదం చూస్తున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తే.

ఐతే ‘2.0’ టీం సభ్యులకే రిలీజ్ డేట్ విషయంలో ఏ స్పష్టతా లేనట్లుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ సైతం ‘2.0’ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పడం విశేషం. ‘2.0’ రిలీజ్ వాయిదా అన్న వార్త బయటికి రాగానే అక్షయ్ కుమార్ తాను కథానాయకుడిగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘ప్యాడ్ మ్యాన్’ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేశాడు.

కానీ ‘2.0’ రిలీజ్ వాయిదా అన్నది కన్ఫమ్ కాకపోవడంతో అతను కొంచెం వెనక్కి తగ్గాడు. ఇంతకీ ‘2.0’.. ‘ప్యాడ్ మ్యాన్‌’ల్లో ఏది గణతంత్ర దినోత్సవం కానుకగా వస్తుంది అని అతణ్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘దీనిపై నాకు కూడా క్లారిటీ లేదు. 2.0 జనవరి 25న విడుదలైతే నా సినిమాను ఆపుతాను. ఆ సినిమా వాయిదా పడితే ‘ప్యాడ్ మ్యాన్’ 26న విడుదలవుతుంది. ఈ విషయంలో స్పష్టత కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా’’ అని చెప్పాడు. మరి ఈ స్పష్టత ఎప్పుడొస్తుందో ఏమో?
Tags:    
  • Akshay Kumar 
  • Robo 2.0 Movie 
  • TElugu News 

Similar News

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

Copyright @2026

Powered by Blink CMS