వీడెవడు? ఎవరండీ బాబూ అసలు

Update: 2017-02-07 09:05 GMT
''వీడెవడు?''. అదే సినిమా టైటిల్. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అనే చర్చ టాలీవుడ్లో ప్రతీ నోటా వినిపిస్తోంది. ఎందుకంటే దీనిని ట్వీట్ చేసింది మరో స్టార్ హీరో. అయితే ఇంకో స్టార్ హీరో ఇంకో విధంగా ట్వీట్ చేయడంతో.. హీరో ఎవరండీ బాబూ అంటూ జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.

నిజానికి యంగ్ తరంగ్ అఖిల్ అక్కినేని ''వీడెవడు?'' గురించి ట్వీటేశాడు. ఈ ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. వెంటనే 'అది తన టీమ్ మేట్' అంటూ కూడా హింటిచ్చాడు. అలా అనగానే అందరూ ఈ సినిమా బహుశా నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమాయేమో అనుకున్నారు. కాని కట్ చేస్తే.. ఇదే పోస్టర్ తమిళ్ పోస్టర్ ''యార్ ఇవాన్?'' ట్వీట్ చేశాడు హీరో ఆర్య. ఈ హీరో ఒక క్రికెటర్ అని.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని.. అతను తమిళంలో డెబ్యూ చేస్తున్నాడని చెప్పాడు. దానితో అసలు ఈ సినిమాలో హీరో ఎవరైయుంటారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కొంతమంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటుంటే.. కొంతమంది జాన్ అబ్రహాం.. అంటూ చాలా పేర్లే చెబుతున్నారు. అయితే హీరో ఎవరనేది మాత్రం తెలియట్లేదు. ఇక అసలు విషయం తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News