ఫస్ట్‌ లుక్‌ : ఇరగదీసిన అఖిల్‌

Update: 2015-08-27 11:26 GMT
అఖిల్‌ అఖిల్‌ సినిమాలో ఇరగదీశాడు. అవునండీ.. హీరో అఖిల్‌.. ''అఖిల్‌'' సినిమాలో చితక్కొట్టేశాడు. ఏకంగా తన పేరును తన తొలి సినిమాకు హీరో పేరుగా కాదు ఏకంగా సినిమా పేరుగానే పెట్టేసుకున్నాడు సిసింద్రీ అఖిల్‌. మాస్‌ డైరక్టర్‌ వివి వినాయక్‌ డైరక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా పేరును ఎట్టకేలకు కొన్ని రూమర్లలో ఊహించినట్లుగానే కథానాయకుడి అసలు పేరునే సినిమాకు టైటిల్‌ గా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే అలా చేయడం వలన రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కింగ్‌ నాగార్జున దానికే ఓటేశారట.

ఇకపోతే వినాయక్‌ ఈ సినిమా తొలి పోస్టర్‌ లో అఖిల్‌ ను ఎంతో సూపర్బ్‌ గా చూపించాడు. ఒక్కసారిగా అఖిల్‌ ను ఆకాశం రేంజులో నిలబెట్టేశాడు. లో యాంగిల్‌ లో ఎంతో డైనమిక్‌ గా అఖిల్‌ ను చూపిస్తూ.. వావ్‌ వాటే హీరో అని జనాలు అనుకునేలా చేశాడు. ఇకపోతే చేతిలో ఒక ఫైర్‌ బాల్‌, దాని నుండి ఏదో మెరుపులాంటి ఒక సెగ.. అబ్బో.. ఒక కమర్షియల్‌ హీరోగా బీభత్సమైన స్టార్‌ డమ్‌ వచ్చాక వేయాల్సిన గెటప్‌ తొలి సినిమాకే వేశాడంటే.. అసలు స్ర్కిప్టు ఆ రేంజులో వచ్చిందా అంటూ ఇప్పుడు ఫిలిం నగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నారు. అఖిల్‌.. ఇగరదీశావ్‌ పో.. ఇక టీజర్‌ రాకే తరువాయి.
Tags:    

Similar News