యంగ్ రెబల్ స్టార్ మూవీలో మరో బాలీవుడ్ స్టార్...?

Update: 2020-10-12 10:37 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో 'డార్లింగ్‌' ప్రభాస్‌ 'రాముడి'గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ 'లంకేష్'గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న అజయ్ దేవగణ్.. 'ఆదిపురుష్‌' లో నటించడానికి ఒప్పుకున్నాడట. అజయ్ దేవగణ్ ఇప్పటికే ఓం రౌత్‌ దర్శకత్వంలో 'తానాజీ' సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం మరోసారి సైఫ్ అలీఖాన్ తో పాటు అజయ్ దేవగణ్ ని కూడా తీసుకురానున్నారట. అందులోనూ అజయ్ దేవగన్ ఈ సినిమాలో 'శివుడి' పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్' ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు హిందీ భాషల్లో 3డీలో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి కూడా డబ్ చేయనున్నారు.
Tags:    

Similar News