బాలీవుడ్లో మరో వీర యోధుడి కథ

Update: 2017-07-20 11:42 GMT
మన దేశ చరిత్రలో అందరికి తెలిసిన వీరులు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది కొన్ని ప్రాంతాలుకు మాత్రమే సంబంధించిన యోధులు ఉంటారు. ఎవరు ఏమి చేసినా ఎక్కడ చేసిన వాళ్ళ పోరాటాలు  ప్రజలు కోసమే కాబట్టి  ఆ వీరులు చరిత్రలలో మిగిలిపోతారు తరవాత తరాలుకు ఆదర్శంగా నిలుస్తారు. బాలీవుడ్ ఇప్పుడు అటువంటి కథలు పై దృష్టి సారించింది. ఈ మధ్య వచ్చిన బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలు మరిన్ని హిస్టారికల్ కథలును సినిమాలుగా మార్చే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో అజయ్ దేవగన్ కూడా ఒక మరాఠీ వీరుని కథతో రాబోతున్నాడు.

అజయ్ దేవగన్ ఇప్పటికే రియల్ హీరో భగత్ సింగ్ లాంటి పాత్రలు చేసి అందరినీ మెప్పించాడు. ఒక మరాఠీ వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే పై చిత్రం నిర్మించబోతున్నారు అందులో తానాజీ గా అజయ్ దేబగన్ నటించబోతున్నాడు. తానాజీ అనే మరాఠీ మిలిటరీ లీడర్ ఛత్రపతి శివాజీ దగ్గర పని చేసేవాడు. శివాజీకి తానాజీ మంచి మిత్రుడు అని కూడా చెబుతారు. 1670 లో సింహగడ్ యుద్దంలో తానాజీ తన ప్రజలు కోసం తన మాతృ భూమి  కోసం పొరాడి దేశానికి గర్వకారణం అయ్యాడు. మరాఠీ సామ్రాజ్యంలో తానాజీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.  ఇతని పై ‘గడ్ ఆలా పాన్ సింహ్ గెలే’ అనే నవల కూడా వచ్చింది.ఇప్పుడు అదే వీరుడు పై అజయ్ దేవగన్ చిత్రం తీయబోతున్నాడు.

ఈ హిస్టారికల్ డ్రామా తో వచ్చే ఏడాది తానాజీగా రాబోతున్నాడు అజయ్. ఈ సినిమా ఫిస్ట్ లుక్ పోస్టర్ కూడా ఒకటి సిద్దం చేసి రిలీజ్ చేశాడు. సినిమాలో ఎటువంటి యుద్దాలు ఉండబోతున్నాయో తెలిసే లా డిజైన్ చేశారు. మరాఠీ ఆర్మీ డ్రెస్ వేసుకొని కత్తి పట్టి రణరంగంలో తన వీరం చూపిస్తున్న తానాజీ రూపాన్ని చూపించారు. ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్ట్ చేయబోతున్నాడు.​
Tags:    

Similar News