ఫొటోటాక్‌ః అజంతా శిల్పం బికినీలో నడిచి వస్తున్నట్లుగా ఉంది

Update: 2021-01-01 08:29 GMT
మహేష్ బాబు హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సోఫీ చౌదరి గుర్తుందా.. ఈ అమ్మడు ఉత్తరాదిలో బిజీ అయ్యింది. బుల్లి తెర మరియు వెండి తెరలపై సమానంగా కనిపిస్తూ వస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా రచ్చ చేస్తూనే ఉంది. ఈ అమ్మడి అందాల ఆరబోత విషయంలో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడు బికినీ ట్రీట్ తో తన పాలోవర్స్‌ ను మాత్రమే కాకుండా నెటిజన్స్‌ అందరిని కూడా వావ్‌ అనిపించేలా చేస్తుంది.

సోఫీ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో మతులు పోగొడుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సినిమాలు లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ప్రదర్శణతో రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తున్న ఈ అమ్మడు బుల్లి తెర షోలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఈమె చేస్తున్న షోల ప్రమోషన్‌ కోసం ఇలా హాట్ ఫొటో షూట్‌ ను ఇస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సముద్రంలో అలా నడుచుకుంటూ వస్తుంటే బికినీలో అజంతా శిల్పం నడుచుకుంటూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ పడుతున్నాయి.
Tags:    

Similar News