ఆరాధ్య‌ను రానివ్వ‌కుండా ఐశ్వ‌ర్య‌రాయ్ మోకాల‌డ్డేస్తోందా?

Update: 2021-02-06 07:00 GMT
మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ వెండితెర నాయిక‌గా ఉన్న‌త శిఖ‌రాల్ని అధిరోహించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఐశ్వ‌ర్యారాయ్ సుమారు రెండు ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏలారు. ఆ త‌ర్వాత బ‌చ్చ‌న్ ల కోడ‌లు అయ్యారు. ఇక ఇటీవ‌లి కాలంలో ఐష్ కెరీర్ ఆశించినంత లేక‌పోయినా.. త‌న గురువు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ లాంటి భారీ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.

స‌రిగ్గా ఇలాంటి వేళ ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత త‌న వార‌సురాలు బ‌రిలో దిగుతుందా? ఐష్ కుమార్తె ఆరాధ్య‌బ‌చ్చ‌న్ బాల‌న‌టిగా ఆరంగేట్రం చేస్తుందా? అంటూ అభిమానుల్లో ఒక‌టే సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కుముందే అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న భార్య ఐశ్వ‌ర్యారాయ్ కి బిలేటెడ్ గా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు చెబుతూ ఐష్-ఆరాధ్య ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో వ‌డి వ‌డిగా ఎదిగేస్తున్న‌ ఆరాధ్య రూపం ఆక‌ర్షిస్తోంది.

నిజానికి బ‌చ్చ‌న్ ల మ‌న‌వ‌రాలిగా ఆరాధ్య తెరంగేట్రం ఈపాటికే జ‌రిగేదే. కానీ ఐశ్వ‌ర్యారాయ్ ఇంకా వ‌ద్ద‌ని అంటున్నార‌ని.. డాడీ అభిషేక్ త‌న‌ని న‌టిగా మ‌లిచేందుకు తొంద‌ర‌ప‌డుతున్నా.. మ‌మ్మీ రూపంలోనే ఆరాధ్య‌కు బ్రేక్ ప‌డుతోంద‌ని ఇంత‌కుముందు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఐశ్వ‌ర్యారాయ్ షేడ్ .. పాపా అభిషేక్ క‌ళ్ల‌తో పుట్టిన ఆరాధ్య బ‌చ్చ‌న్ న‌టిగా వ‌స్తే ఏ మేర‌కు మెప్పిస్తుంది? అన్నది ఆస‌క్తిక‌రంగానే మారింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐశ్వ‌ర్యారాయ్ వీరాభిమానులు ఆరాధ్య న‌టి అవ్వాల‌ని కోరుకుంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శ్రీ‌దేవి కూతురు మ‌రో శ్రీ‌దేవిని త‌ల‌పించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్న‌ట్టే ఐశ్వ‌ర్య కూతురు మ‌రో ఐశ్వ‌ర్యారాయ్ ఎలా అవుతుంది? అన్న విమ‌ర్శ‌లు కూడా ఉండ‌నే ఉంటాయి. మ‌రి ఇన్నిటిని నెగ్గుకుని ఆరాధ్య కూడా న‌ట‌న‌లో ప్ర‌వేశిస్తుందా?  ఎలాంటి కెరీర్ ని ఎంచుకుంటుంది.. ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.


Tags:    

Similar News