‘ఏకే వర్సెస్ ఏ​కే’ సినిమాపై ఎయిర్​ఫోర్స్​ ఫైర్​.. ఆ డ్రెస్సెంటీ? భాషేంటి?

Update: 2020-12-10 03:03 GMT
బాలీవుడ్​ నటుడు అనిల్​కపూర్​ .. ప్రముఖ డైరెక్టర్​ అనురాగ్​ కశ్యప్​ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఏకేవర్సెస్​ఏకే’ వివాదంలో చుట్టుకున్నది. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో డిసెంబర్​ 24న విడుదల కానున్నది. అయితే ఈ నెల 7న సినిమా ట్రైలర్​ రిలీజ్​చేశారు. ఈ ట్రైలర్​పై ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనిల్ కపూర్​ ఈ చిత్రంలో ఎయిర్​ఫోర్స్​ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే అతడు వేసుకున్న ఎయిర్​ఫోర్స్​ యూనిఫామ్​ సరిగ్గా లేదని.. వాడిన భాష కూడా ఎంతో అభ్యంతరకంగా ఉందని ఎయిర్​ఫోర్స్​ పేర్కొన్నది. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​.. అనిల్​కపూర్​ను ట్యాగ్​చేస్తూ ఎయిర్​ఫోర్స్​ ట్వీట్​ చేసింది.

 ఈ ట్వీట్​పై అనిల్​కపూర్​ స్పందించారు. ‘ ఏకే  వర్సెస్ ఏకే   ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని తెలిసింది. భారత వైమానిక దళం యూనీఫాం ధరించి అటువంటి భాషను‌ మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ అనిల్​కపూర్​ ట్వీట్​చేశారు. అయితే ట్రైలర్​లోనే ఇలా ఉంటే సినిమా రిలీజ్​ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఈ చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట.  ఎయిర్​ఫోర్స్​, ఇండియన్​ ఆర్మీ సంబంధిత కథాంశాలతో సినిమాలను తెరకెక్కించేటప్పుడు దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడాకొట్టినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఏకే వర్సెస్​ ఏకే పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ నిర్మిస్తున్నాడు. ఇటీవల ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లో వస్తున్న చాలా సినిమాలు వివాదాలను ఎదుర్కొంటున్నాయి.

 దీంతో ఓటీటీపై కూడా సెన్సార్​ విధించాలని కేంద్రం యోచిస్తున్నది. ప్రస్తుతం థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో ఓటీటీల హవా నడుస్తున్నది. దీంతో దర్శకనిర్మాతలంతా వీటిపైనే దృష్టిసారించారు. ఓటీటీలో సెన్సార్​ లేకపోవడంతో దర్శకనిర్మాతలు స్వేచ్ఛగా సినిమాలు తీస్తున్నారు. చాలా మంది ఈ స్వేచ్ఛను క్రియేటివిటీ ప్రదర్శించేందుకు వాడుకుంటున్నారు. కానీ మరికొందరు కేవలం బూతు కంటెంట్​ను మాత్రమే నమ్ముకొని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Tags:    

Similar News