ప్రభాస్: హిట్టయితే పాఠం.. లేకుంటే గుణపాఠం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ విడుదలకు సిద్ధమైంది. ఎన్నో కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏడాదికి రెండు సినిమాలు చేసి.. ప్రేక్షకులను అలరిస్తానని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రభాస్ లానే... మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వంటి హీరోలు సైతం పలు సార్లు ఇలాంటి మాటలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కరు ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి.
అయితే ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో రెడీగా ఉన్నాడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సలార్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఆ తర్వాత 2024కి ప్రాజెక్ట్-కె, మారుతి సినిమాలు రిలీజ్ కానున్నాయి. 2025లో సందీప్ వంగాతో స్పిరిట్ మూవీతో పాటు మరో రెండు సినిమాలు ప్రకటించనున్నాడు. అలా ఏడాదికి రెండు చొప్పున ప్రభాస్ సినిమాలు చేయబోతున్నాడు అన్నమాట.
అయితే సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ... బాహుబలి తరువాత ప్రభాస్ కు సరైన సక్సెస్ లేదు. బహుబలి సిరీస్ లతో వచ్చిన క్రేజ్... ఆ తర్వాత చేసిన సాహో, రాదేశ్యామ్ ప్రభాస్ కు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
బహుబలి రేంజ్ హిట్ అయితే పడలేదు. ఇప్పుడు ప్రభాస్ ఆశలన్నీ ఆది పురుష్ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమా అటు ఇటు అయితే మాత్రం ప్రభాస్ పడిన కష్టానికి ఫలితం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఆ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని ఆలోచించి సినిమాలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడితే... ఇక ఏడాదికి రెండు సినిమాలు అనే మాట నిలబెట్టుకోవడం కష్టమవుతుందని అర్థం అవుతుంది. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. తాన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.