ఆ కారణంగా స్టార్ హీరోయిన్ కాలేకపోయిన పవిత్ర

Update: 2023-05-27 22:10 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం పవిత్ర లోకేష్ అంటే తెలియని వారు ఉండరు రవితేజ దొంగోడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆమె తెలుగులో ఇప్పటికే చాలా చిత్రాలలో నటించింది. కాని నటిగా పవిత్ర లోకేష్ కి వచ్చిన గుర్తింపు కంటే సీనియర్ యాక్టర్ నరేష్ తో ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిలో పడింది.

ఇదిలా ఉంటే తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల  ముందుకి వచ్చారు. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీరిద్దరి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితోనే మళ్ళీ పెళ్లి సినిమాని తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అయితే పవిత్ర లోకేష్ కన్నడ నాట హీరోయిన్ గానే కెరియర్ స్టార్ట్ చేసిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

నిర్మాత, నటుడు అయిన మైసూర్ లోకేష్. తండ్రి వారసత్వంతోనే ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కి జోడీగా మిస్టర్ అభిషేక్ సినిమాతో ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టారు. తరువాత కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే అందం, అభినయం ఉన్న కూడా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని నటిస్తూ వస్తోంది.

కన్నడంలో 150 చిత్రాలలో ఆమె నటించడం విశేషం.హీరోయిన్, హీరోయిన్ ఫ్రెండ్, గా చెల్లెలు, తల్లి పాత్రలతో పవిత్ర లోకేష్ నటించారు. ఇక తెలుగులో 2003లోనే రవితేజ దొంగోడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్థానం సినిమాలో ఆమె పోషించిన శర్వానంద్ తల్లి పాత్ర భాగా గుర్తింపు తీసుకొచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా మూవీస్ చేస్తూనే ఉన్నారు.

అయితే పవిత్ర లోకేష్ చాలా మంది హీరోయిన్స్ కంటే అందంగా ఉన్న స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణం ఆమె హైట్ అని చెప్పాలి. కన్నడ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యే సమయానికి స్టార్ హీరోలుగా ఉన్న అందరూ హైట్ లో ఆమె కంటే తక్కువ. 5.10 అడుగులు ఎత్తు ఉండే పవిత్ర లోకేష్ ముందు హీరోలు అస్సలు సెట్ అయ్యేవారు కాదు. దీంతో దర్శక, నిర్మాతలు ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసేవారు కాదని తెలుస్తోంది. అయితే కెరియర్ ఆరంభంలో ఇతర భాషలలో ఆమె హీరోయిన్ పాత్రలకి ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని తెలుస్తోంది.

Similar News