కమాన్ బచ్చన్ నువ్వు సాధిస్తావు
దేశ వ్యాప్తంగా ప్రముఖులను కంగారు పెడుతున్న కరోనా వైరస్ తో అమితాబచ్చన్ ఫైట్ చేశారు. ఆయన దాదాపు మూడు వారాల తర్వాత కరోనాను జయించారు. అమితాబ్ తో పాటు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఆరాధ్యలు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. అమితాబ్ కు ముందే ఐశ్వర్య మరియు ఆరాధ్యలు కరోనాను జయించారు. ఆ తర్వాత అమితాబ్ కూడా కరోనా నుండి బయట పడ్డారు. కాని ఇప్పటి వరకు అభిషేక్ బచ్చన్ మాత్రం కరోనాతోనే బాధపడుతున్నాడు.
తన ఆరోగ్య విషయాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తున్న అభిషేక్ బచ్చన్ ఈసారి ఆసుపత్రిలో తన హెల్త్ కేర్ బోర్డ్ ఫొటోను షేర్ చేశాడు. అందులో డిశ్చార్జ్ ప్లాన్ వద్ద ‘నో’ అంటూ ఉంది. ఆ ఫొటోను ట్వీట్ చేయడంతో పాటు కమాన్ బచ్చన్.. నువ్వు సాధించగలవు అంటూ కామెంట్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు భారీ ఎత్తున కామెంట్స్ వచ్చాయి. చాలా మంది జూనియర్ బచ్చన్ నువ్వు సాధించగలవు బాగా ప్రయత్నించు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నువ్వు చేయాల్సినవి చాలా ఉంటాయి. వాటిని చేయి అంటూ సలహా ఇచ్చారు. కొందరు ఈ విషయమై ఆయన్ను విమర్శించారు.
నీ తండ్రి కరోనాను జయించారు. కాని నువ్వు మాత్రం దానితో ఇంకా బాధపడుతూనే ఉన్నావు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ఎద్దేవ చేశారు. ఇక జూనియర్ బచ్చన్ ట్వీట్ కు ఆయన సోదరి స్వేత బచ్చన్ స్పందిస్తూ గ్యాంగ్ అంతా ఇక్కడే నీకోసం ఉంది. నువ్వు సాధిస్తావు అంటూ ధైర్యం చేప్పింది. మరో వారం రోజుల్లో బచ్చన్ నెగటివ్ రిపోర్ట్ వస్తుందనే నమ్మకంను ఆసుపత్రి వర్గాలు కూడా వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో అభిషేక్ ఉన్న విషయం తెల్సిందే.