ఐష్ ఫ్లాష్ బ్యాక్ చూపించేసిన అభిషేక్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడు.. మాజీ మిస్ వరల్డ్ అండ్ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ భర్త అయిన అభిషేక్ బచ్చన్ కు.. స్వయంగా కూడా బోలెడంత గుర్తింపు ఉంది. లెక్కకు మించి విపరీతంగా సినిమాలు చేసేయకపోయినా.. తనదైన యాక్టింగ్ తో తాను మెచ్చిన సినిమాలను చేస్తుంటాడు అభిషేక్.
అయితే ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడేస్ అనే హ్యాష్ ట్యాగ్ లో భాగంగా అభిషేక్ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో తన భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు బీపీ చెక్ చేస్తూ ఉంటాడు అభి. ప్రొఫెషనల్ తో పాటు ఇటు పర్సనల్ ఫోటోలను కూడా ట్వీట్ చేసే అభిషేక్.. రెండు యాంగిల్స్ కి చెందిన ఈ ఫోటోను షేర్ చేయడం ఆసక్తి మారింది. ఇదేమీ రీసెంట్ పిక్ కాదు. రావణ్ మూవీ షూటింగ్ టైంలో.. ఐశ్వర్యా రాయ్ ఎక్కువగా నీళ్లలోనే సీన్ చేయాల్సిన సందర్భం అది.
ఆ టైంలో ఐష్ కు ఫీవర్ తోపాటు బీపీ కూడా రెయిజ్ అయిపోయాయి. డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నా.. భార్య బీపీ ఏ స్థాయిలో ఉందో తనే చెక్ చేస్తున్నప్పటి ఫోటోను ఇప్పుడు షేర్ చేసిన అభిషేక్.. అప్పటి ఫ్లాష్ బ్యాక్ ను చూపించేశాడు. వీళ్లిద్దరికీ పెళ్లి అయిన తర్వాత.. కలిసి నటించిన రెండో సినిమా రావణ్ కాగా.. మళ్లీ ఇప్పటివరకూ ఆ కాంబినేషన్ సెట్ కాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/