శృంగార గురు బయోపిక్ లో స్టార్ హీరో

Update: 2018-07-10 10:17 GMT
ఇప్పుడంతా బయోపిక్ ల కాలం.. మొన్నీ మధ్యనే వచ్చిన సావిత్రి జీవితగాథ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక హిందీలో వచ్చిన సంజయ్ దత్ జీవితగాథ ‘సంజు’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. బయోపిక్ అంటే మినిమం గ్యారెంటీ అన్న భావన ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బయోపిక్ కు రంగం సిద్ధమైంది.

అటు ఆధ్యాత్మికతతో పాటు.. ఇక శృంగార గురుగా పేరుపొందిన స్వామీ ‘ఓషో’ పై బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నారు. క్లిష్టమైన వాదనతోపాటు.. ప్రతీ దాంట్లోనూ లాజికల్ గా సమాధానాలు చెప్పే ఓషో జీవితం మొత్తం వివాదాలతోనే నిండి ఉంది. ఆయనపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం కూడా కత్తి కట్టింది. ఓషోను చంపించేందుకు కుట్రలు కూడా జరిగాయి.

ఓషో చెప్పే శృంగార విధానాలు - జీవితంలో సెక్స్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై ఇప్పటికే జోరుగా చర్చలు సాగుతుంటాయి. బంధాల విషయంలో నిజాయితీతో ఉండాలని.. జీవితాన్ని కొత్త కోణంలో చూడాలని ఓషో చెబుతాడు. అంతటి విలక్షణమైన వ్యక్తిత్వం గల ఓషో జీవితాన్ని తెరకెక్కించాలని బాలీవుడ్ నిర్మాతలు సాహసమే చేస్తున్నారు..

విశేషం ఏంటంటే ఓషోగా అమీర్ ఖాన్ నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో కపూర్ అండ్ సన్స్ మూవీని రూపొందించిన శకున్ బత్రా ‘ఓషో’ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తారని సమాచారం.  

ఓషో జీవితం పై కూర్చిన కథ - స్క్రిప్ట్ చూశాక అమీర్ ఖాన్ ఓకే చెప్పినట్లు గా చెబుతున్నారు. ఓషో జీవితం మొత్తం సంచలనం.. వివాదాస్పదంగా ఉంది. మరి అలాంటి మూవీని అమీర్ ఖాన్ చేపడుతుండడంతో ఈ మూవీలో చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Tags:    

Similar News