3 ఈడియట్స్ సీక్వెల్.. బ్రేకింగ్ న్యూస్ వద్దు
అమీర్ ఖాన్ కి మీడియా పవర్ ఏంటో బాగానే తెలిసొచ్చింది. తను క్రాఫులు కొట్టినా, గుళ్లు చేసినా ఫ్రీగా పబ్లిసిటీ చేసే రేంజ్ ని మీడియా దాటిపోయిందని.. ఎక్కడైనా దొరికితే ఏకేస్తారనే సత్యం బాగానే గ్రహించాడు. అందుకే ఇప్పుడేదైనా చెప్పాలంటే.. దాన్ని ముందు మీడియా మీదకు నెట్టేయడమో, వాళ్లని బతిమిలాడుకోవడమో చేస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్ లో.. అమీర్ ఖాన్ చేసిన మూవీ రంగ్ దే బసంతి రిలీజ్ అయ్యి.. ఏడేళ్లు పూర్తైన సందర్భంగా.. మీడియాతో ముచ్చట్లాడాడు అమీర్ ఖాన్.
ఆ సమయంలో 3ఈడియట్స్ కు సంబంధించిన లీక్ ఒకటి ఇచ్చాడు. 'రాజు(రాజ్ కుమార్ హిరాణీ) కొంతకాలం క్రితం నన్ను కలిశాడు. 3 ఈడియట్స్ సీక్వెల్ కి స్టోరీ సిద్ధం చేసినట్లు చెప్పాడు. త్వరలో మేమిద్దరం మళ్లీ కలిసి చేసే ఛాన్స్ ఉంది' అని చెప్పాడు అమీర్. అయితే.. ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే అది పెద్ద విషయమే కానీ.. దయచేసి దీన్ని బ్రేకింగ్ న్యూస్ గా చేయద్దంటూ మీడియాని రిక్వెస్ట్ చేయడం ఆశ్చర్యం వేసింది.
అసహనం పై వ్యాఖ్యల తర్వాత.. అమీర్ ఏది మాట్లాడినా.. చాలామందిలో అసహనం పెరుగుతోంది. అందుకే ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా ఇలా సైలెంట్ గా చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ప్రతీ సందర్భాన్నీ హంగామాగా సెలబ్రేట్ చేసుకుంటూ.. ఎక్కడికి వెళ్లినా మీడియాకు లీకులిచ్చే అమీర్ ఖాన్.. ఇప్పుడు దయచేసి పబ్లిసిటీ చేయకండి అంటూ.. బతిమిలాడుకోవాల్సి వస్తోంది. టైం బ్యాడ్ అంటే ఇదే.