బాలీవుడ్ స్టార్ హీరోలలో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ది విలక్షణ శైలి. అమీర్ చేసే ప్రతి పనిలోనే తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ సీక్రెట్ సూపర్ స్టార్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న అమీర్ తన భార్య బర్త్ డే వేడుక కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాడట. ఇందులో విశేషమేముందని కంగారుపడకండి. అమీర్ సెలబ్రేట్ చేసింది ఆయన ప్రస్తుత భార్య కిరణ్ రావ్ బర్త్ డే కాదు...ఆయన మాజీ భార్య రీనా దత్తాది. ఆ బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఫొటోలను అమీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన మాజీ భార్య పుట్టిన రోజు వేడుకలకు హాజరైన అమీర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే అమీర్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మిస్టర్ పర్ ఫెక్ట్ అంటూ తమ అభిమాన హీరోను పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టర్కీ పర్యటన నుంచి వచ్చిన అమీర్ సీక్రెట్ సూపర్ స్టార్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో అమీర్, రీనా దత్తా పిల్లలు ఇరా, జునైద్ లు ఫోన్ చేసి రీనా దత్తా కోసం ఓ సర్ ప్రైజ్ బర్త్ డే పార్టీని ప్లాన్ చేద్దామని చెప్పారట. దీంతో, అమీర్ తన ప్రోగ్రామ్స్ ను రీషెడ్యూల్ చేసుకొని రీనా 50వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలో రీనా కేక్ కట్ చేస్తుంటే అమిర్ షాంపెయిన్ బాటిల్ పట్టుకుని తన మాజీ భార్య బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ పార్టీలో అమీర్ తో పాటు కిరణ్ రావ్ కూడా పాల్గొనడం విశేషం. ఆ పార్టీ ఫొటోలు, వీడియోను అమీర్ సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. రీనా, అమీర్ లు 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2002లో విడిపోయారు. వారి పిల్లలు జునైద్ ఖాన్, ఇరాలు రీనాతో ఉంటున్నారు. అమీర్ 2005లో కిరణ్‌రావ్ ను పెళ్లి చేసుకున్నాడు. విడిపోయినప్పటికీ అమిర్, రీనా స్నేహంగానే ఉంటున్నారు. ఇప్పటికీ రీనా....అమీర్ కుటుంబంలో జరిగే శుభకార్యాలకు, అమీర్, కిరణ్ లు రీనా ఇంట్లో ఫంక్షన్లకు హాజరవుతుంటారు.
Full View