వీడియో: భామ‌తో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చిందులే చిందులు

Update: 2021-02-03 11:30 GMT
మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏం చేసినా దానికో ప్ర‌త్య‌క‌త ఉంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న జైపూర్ లో ఓ క్ల‌బ్ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. `లాల్ సింగ్ చద్దా` షూటింగ్ కోసం నటుడు పింక్ సిటీలో ఉన్నారని జ‌నం భావించినా.. అత‌డు వేరే షూట్ కోసం అక్క‌డికి వెళ్లార‌ట‌. తన చిరకాల మిత్రుడు అమిన్ హాజీ చిత్రం `కోయి జానే నా` కోసం ప్రత్యేక నంబర్ చిత్రీకరణ‌కు స‌హాయ‌ప‌డుతున్నారు.

ఈ పాట‌లో ఎల్లీ అవ్ ‌రామ్ తో కలిసి క్లబ్ నంబర్ ‌లో అమీర్ డ్యాన్సులు చేస్తున్న వీడియో సెట్ నుంచి లీకైంది. ప్ర‌స్తుతం ఇది మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

“అమీర్ ఒక పరిపూర్ణుడు కావడంతో అతను `ఫైనల్ నంబర్` కోసం షూటింగ్ చేయడానికి ముందు బోస్కో మార్టిస్ బృందంతో కొన్ని రోజులు పాట కోసం రిహార్సల్ చేశాడు. ఈ పాటను చిత్రీకరించేందుకు జైపూర్ లో ప్రత్యేక క్లబ్ సెట్ ‌ను నిర్మించారు. చాలా ఉత్సాహంగా ఈ పాట‌ను చిత్రీక‌రించారు`` అని తెలుస్తోంది.

కోయి జానే నా సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఖునాల్ కపూర్ - అమీరా దస్తూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టీసిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలో టీసిరీస్ ఫౌండ‌ర్ గుల్షన్ కుమార్ బయోపిక్ పై అమీర్ ఖాన్ ‌తో కలిసి పనిచేయనున్నారు.

తాజా నివేదిక ప్రకారం.. అమీర్ న‌ర్తించిన ఈ స్పెష‌ల్ పాట‌ను తానిష్ బాగ్చి స్వరపరిచారు. సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య అందించారు. అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత ఒక ప్ర‌త్యేక పాట కోసం ప‌ని చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కుముందు `సీక్రెట్ సూపర్ స్టార్`.. దిల్లీ బెల్లీలో ఈ త‌ర‌హా నంబ‌ర్ల‌లో న‌ర్తించారు. ఆ సినిమాల‌కు అమీర్ స్వ‌యంగా నిర్మాత‌.

ఇదిలావుండగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో క‌రీనా క‌థానాయిక‌. 3 ఇడియట్స్ .. తలాష్ త‌ర్వాత ఈ జోడీ మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్నారు.
Full View
Tags:    

Similar News