మహాభారతం.. నేనెప్పుడు అనలేదే
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ వరుస విజయాలకు 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంతో బ్రేక్ పడింది. భారీ అంచనాల నడుమ, 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం మినిమం కలెక్షన్స్ ను కూడా రాబట్టలేక పోయింది. అమీర్ ఖాన్ ను ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ చిత్రం తర్వాత అమీర్ కాస్త గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు అమీర్ తన తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకోలేదు. అతి త్వరలోనే తన కొత్త సినిమా ప్రకటిస్తానంటూ అమీర్ చెప్పుకొచ్చాడు. మూడు నాలుగు కథలు ప్రస్తుతం తన వద్ద ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోలేక పోతున్నట్లుగా పేర్కొన్నాడు.
ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం వర్కౌట్స్ ప్రారంభించాను. కథ ఏదైనా నేను బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. అందుకే బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేయడంతో పాటు, డైటింగ్ కూడా చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇదే సమయంలో మీరు వెయ్యి కోట్లతో మహాభారతం సినిమాను చేయబోతున్నట్లుగా చెప్పారు కదా, ఆ సినిమా ఏమైంది అంటూ మీడియా వారు ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానంను అమీర్ ఖాన్ ఇచ్చాడు. తానెప్పుడు మహాభారతం సినిమా గురించి మాట్లాడలేదు, మీకు మీరు అనుకుని వార్తలు రాశారు. అందుకు నేనేం చేయలేను.
అమీర్ ఖాన్ తో మహాభారతం నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వెయ్యి కోట్లతో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పుకార్లే అని అమీర్ ఖాన్ తేల్చి పారేశాడు. తాను గతంలో ఎప్పుడైనా ప్రకటించిన సినిమాల గురించి ప్రశ్నిస్తే తాను సమాధానం చెప్తాను, కాని తనకు సంబంధం లేని విషయాలను, తాను మాట్లాడని విషయాలను గురించి స్పందించమంటే ఎలా అంటూ అమీర్ ఖాన్ రివర్స్ ప్రశ్నించాడు. మహాభారతం సినిమా అమీర్ ఖాన్ ఆలోచనల్లోనే లేదని తేలిపోయింది. అమీర్ ఖాన్ కొత్త సినిమా ఏ ఏడాది సమ్మర్ లో ప్రారంభం అయ్యి ఇదే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.