మనోహరి వరల్డ్ ఫేమస్ ఇప్పుడు.. జక్కన్న, అట్లీ సినిమాల్లో ఛాన్స్ దక్కేనా?
నోరా ఫతేహి ప్రచారం చేయడం వల్ల ఫిఫా వరల్డ్ కప్‌కి క్రేజ్ పెరిగిందా లేక ఫిఫాకి ప్రచారం చేయడం వల్ల నోరాకి క్రేజ్ పెరిగిందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.
నోరా ఫతేహి ప్రచారం చేయడం వల్ల ఫిఫా వరల్డ్ కప్‌కి క్రేజ్ పెరిగిందా లేక ఫిఫాకి ప్రచారం చేయడం వల్ల నోరాకి క్రేజ్ పెరిగిందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే అందులో రెండో దానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోందని మెజారిటీ నెటిజనుల అభిప్రాయం. ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో ఫాలోవర్లు ఉన్నా.. ఎందుకనో 2026 టోర్నీకి అంతగా క్రేజ్ రాలేదని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఇలాంటి తరుణంలో ఈ మెగా ఈవెంట్‌లో నోరా ఫతేహి ఇచ్చిన పర్‌ఫార్మెన్స్ తనకు ఉన్న ఇమేజ్ ని పదింతలు పెంచింది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఈవెంట్‌లో అద్భుతమైన నృత్య ప్రదర్శన తర్వాత నోరా ఫతేహికి అంతర్జాతీయంగా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రధానమైన గ్లోబల్ ఈవెంట్ ముగిసిన తర్వాత అసలు ఈ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఎవరు? అంటూ ప్రపంచ దేశాల్లోని నెటిజన్లు గూగుల్‌లో విపరీతంగా శోధించారు. దాంతో ఆమె పేరు గ్లోబల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్, సౌత్ సినిమాలకే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఫిఫా స్టేజ్ పుణ్యమా అని అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయి ఓ వెలుగు వెలుగుతోంది.
నోరా ఫతేహికి అంతర్జాతీయంగా ఇంతటి క్రేజ్ దక్కింది గనుక ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసిన పలువురు టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులు ఈ బ్యూటీతో తమ సినిమాల్లో ప్రత్యేక గీతాలను ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల వారి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ బిజినెస్ క్రేజ్, బజ్ పెంచుకునే వీలుందని భావిస్తున్నారు. నిజానికి గతంలో నోరా ఫతేహి ఎవరికీ అంతగా తెలియని సమయంలోనే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన టాలెంట్‌ను గుర్తించి ...విజువల్ వండర్ `బాహుబలి` చిత్రంలో `మనోహరి` సాంగ్‌లో నర్తించే అవకాశం కల్పించారు. ఆ పాటలో నోరా ఒంపుసొంపుల విన్యాసాలకు యూత్ ఫిదా అయిపోవడమే కాకుండా... నోరాకు ఇండస్ట్రీలో పెద్ద మైలేజ్ వచ్చింది. ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్‌తో వచ్చిన గ్లోబల్ క్రేజ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు నోరాను రాజమౌళి తన తదుపరి భారీ చిత్రం `వారణాసి` కోసం మళ్లీ బరిలోకి దించుతాడా? అంటూ ఒక సెక్షన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న గ్లోబల్ మూవీ `రాకా`లోనూ, ప్రభాస్ - నాగ్ అశ్విన్ కల్కి 2లోను నోరా స్పెషల్ ఎంట్రీ ఉంటే సినిమాలకు అదనపు బలంగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నోరా ఫతేహి బాడీ లాంగ్వేజ్, గ్రేస్‌ఫుల్ స్టెప్పుల పరంగా తనకు సాటిరాగల డ్యాన్సింగ్ క్వీన్ ప్రస్తుతానికి ఇండియాలో లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండియా నుంచి పాన్-వరల్డ్‌ను ఢీకొట్టడానికి వెళ్లే ప్రతి భారీ యాక్షన్ లేదా కమర్షియల్ సినిమాకి నోరా లాంటి ఇంటర్నేషనల్ గుర్తింపు ఉన్న డ్యాన్సర్ తోడైతే, అది కచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియాల్లో కామెంట్ చేస్తున్నారు.
ఫిఫా 2026 వేదికను నోరా ఫతేహి ఉపయోగించుకున్న తీరును చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇతర డ్యాన్సింగ్ క్వీన్స్ కూడా నోరాను చూసి స్ఫూర్తి పొందాలని, తమను తాము గ్లోబల్ వేదికలపై ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేర్చుకోవాలని నెటిజన్లు సూచించడం విశేషం. కేవలం ఇండస్ట్రీ అద్దె రూమ్‌లకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఈవెంట్లను అందిపుచ్చుకుంటూ గ్లోబల్ బ్రాండ్‌గా ఎలా ఎదగాలో నోరా రూట్ మ్యాప్ చూపిస్తోందని విశ్లేషిస్తున్నారు.