మన 'పుష్ప' కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. డిసెంబర్ 17న విడుదల కాబోతున్న పుష్ప సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక మలయాళంలో కూడా బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది కనుక అక్కడ కూడా ఈ సినిమా కోసం జనాలు ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేయడం చాలా కామన్ విషయం. కాని పుష్ప కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పుష్ప ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ.. చూడ్డం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో వారు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు ఏంటీ అంటూ పోల్ పెట్టిన సమయంలో టాప్ 10 లో మన పుష్ప కు చోటు దక్కింది.
బాలీవుడ్ లో పలు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా టాప్ 10 లో చోటు దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూర్యవంశీ సినిమాను ఎక్కువ మంది చూసేందుకు ఎదురు చూస్తున్నామంటూ నెం.1 స్థానంలో నిలిపారు. ఇక మలయాళంలో రూపొందుతున్న మోహన్ లాల్ మరక్క సినిమా రెండవ స్థానంలో నిలిచినట్లుగా బుక్ మై షో పోర్టల్ లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న పుష్ప సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా దీంతో అర్థం అయ్యింది.
సుకుమార్ గత చిత్రం రంగస్థలం మరియు అల్లు అర్జున్ గత చిత్రం అల వైకుంఠపురంలో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. రికార్డుల వర్షం కురియడం మాత్రమే కాకుండా ఉత్తరాదిన అల్లు అర్జున్ ఓ రేంజ్ లో కుమ్మేసేలా పుష్ప ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ ద్వారా అక్కడి ప్రేక్షకులను అలరించాయి. మొదటి సారి పుష్ప సినిమా తో బన్నీ పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయబోతున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను దక్కించుకున్నాయి.