ప్రముఖ నిర్మాతకు రూ.400 కోట్లు.. ఏం చేస్తారు?
సెంటిమెంట్లు.. అయింట్ మెంట్లు లాంటివి అన్నిసార్లు వర్క వుట్ కావు. మారిన కాలానికి అనుగుణంగా మారకపోతే.. ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అందులో భాగంగానే నానక్ రాం గూడాలోని రామానాయుడు స్టూడియోను రియల్ వెంచర్ గా మార్చనున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం.. సురేశ్ బాబు సన్నిహిత వర్గాలు కొట్టి పారేయటం లేదు.
ఏమో.. జరిగినా జరగొచ్చంటున్నారు. రామానాయుడు స్టూడియో పక్కనే భారీ వెంచర్ షురూ చేసిన మీనాక్షి అనే నిర్మాణ సంస్థతో డీల్ కాబట్టి.. ముందుకు వెళ్లటానికే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ స్టూడియో స్థానం లో ఉన్న భూమిని ఏం చేయనున్నారు? ఈ డీల్ ఎంత పెద్దదన్న విషయం మీద ఇండస్ట్రీ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వసనయ వర్గాల సమాచారం ప్రకారం స్టూడియో దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది ఎకరాల విస్తీర్ణం లో ఉందంటున్నారు. ఒకవేళ.. తొమ్మిది ఎకరాలకు ఫిక్స్ అయినా.. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం చూస్తే.. అక్కడ ఎకరం రూ.40 నుంచి రూ.50 కోట్ల మధ్య పలుకుతోంది.
మధ్యస్తంగా రూ.45 కోట్లు వేసుకున్నా.. దగ్గర దగ్గర రూ.400 కోట్ల వరకూ భూమి మీదే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ.. ఈ భూమిని మీనాక్షికి రియల్ వెంచర్ కింద ఇచ్చేసినా వచ్చే మొత్తం భారీగా ఉండటం ఖాయం. ఇన్ని వందల కోట్ల విలువైన భూమిని నిర్మాణ సంస్థ చేతికి అప్పజెప్పే కన్నా.. కలిసి పార్టనర్ షిప్ గా చేసే వీలుందని చెబుతున్నారు. ఏకాఏకిన భూమిని అమ్మేస్తే రూ.400 కోట్ల మేర వచ్చే అవకాశం ఉందని.. అలా కాకుండా రియల్ వెంచర్ లోకి దిగితే మాత్రం ఆదాయం రూ.500 కోట్ల మేర రావటం ఖాయమంటున్నారు. మరింత భారీ మొత్తం చేతికి వచ్చే వేళ.. ఆ మొత్తాన్ని సురేశ్ బాబు ఏం చేస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.