బుడతడు పాతిక లక్షలు గెలిచాడు..బిగ్ బీ ని మెప్పించాడు
అతడి వయసు పదు నాలుగే. కానీ మేధస్సు మాత్రం అమోగం. కౌన్ బనేగా కరోడ్ పతిలో ఏకంగా పాతిక లక్షలు గెలిచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని కూడా మెప్పించాడు. కుర్రాడి తెలివి చూసి అమితాబ్ కూడా ఫిదా అయ్యాడు. ప్రస్తుతం కౌన్ బనేగ్ కరోడ్‌పతి స్టూడెంట్స్ స్పెషల్ వీక్ నడుస్తోంది. గుజరాత్ కు చెందిన అన్ మోల్ శాస్త్రి కేబీసీలో పాటిస్పేట్ చేసాడు. అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు అన్ మోల్ చక్కని సమాధానాలు చెప్పి పాతిక లక్షలు గెలిచాడు. బిగ్ బీ అడిగిన ప్రశ్నలకు అన్ మోల్ ఏ మాత్రం బెరుకు లేకుండా టకా టకా సమాధానాలు చెప్పాడు. 50 లక్షల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు.
అప్పటికే అతడికి ఉన్న లైఫ్ లైన్లను అన్నీ వాడేసు కోవడంతో అన్ మోల్ ఆట నుంచి వైదొలిగి పాతిక లక్షలు గెలుచు కున్నాడు. అన్ మోల్ ప్రతిభను చూసి కేబీసీని స్పాన్సర్ చేస్తున్న సంస్థ మరో రూ. ఐదు లక్షలను అందజేసింది.అన్ మోల్ మంచి ప్రతిభగల విద్యార్ధి అతడు ఇప్పటికే ‘హౌ ఇట్ వర్క్స్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నాడు. అందులో ఫిజిక్స్, బయాలజీకి సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు.
ఈ బుడతడికి ఏపీజే అబ్దుల్‌కలాం, స్టీఫెన్ హాకింగ్‌లంటే ఇష్టమట. ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నదే అన్ మోల్ ధ్యేయం అట. ఎప్పటికైనా నోబెల్ బహుమతి సాధించాలని , బాగా సంపాదించాలని తన మనసులోని మాటను అన్ మోల్ వెల్లడించాడు. కేబీసీలో అన్ మోల్ ప్రతిభ మెచ్చి శభాష్ అనిపించుకుకోవడమే కాదు. అమితాబ్ మనసు కూడా గెలుచుకున్నాడు. అన్ మోల్ నిర్వహిస్తున్న ‘హౌ ఇట్ వర్క్స్’ యూట్యూబ్ ఛానెల్ కు తనవంతుగా ప్రమోట్ చేస్తానని బిగ్ బీ మాట కూడా ఇచ్చాడట.