హడావిడిగా రిలీజ్ డేట్స్ ఇచ్చారు.. ఇప్పుడు రీ షెడ్యూల్ చేస్తున్నారు..!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మూతబడిన థియేటర్లన్నీ.. తిరిగి ఓపెన్ అయ్యాయి. సినిమాలు చూడటానికి జనాలు వస్తారో లేదో అనే సంకోచంతో క్రేజీ మూవీస్ ఏవీ థియేట్రికల్ రిలీజ్ కోసం ధైర్యం చేయలేదు. అదే సమయంలో చిన్న సినిమాలు మాత్రం వారానికి అర డజను చొప్పున విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మీడియం బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్లలోకి రావడానికి త్వరపడుతున్నాయి. దీంతో సినిమాల మధ్య క్లాస్ అనివార్యం అయింది.
ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూడు సినిమాలు అధికారికంగా ప్రకటించాయి. సుధీర్ బాబు - 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ ''శ్రీదేవి సోడా సెంటర్'.. అక్కినేని హీరో సుశాంత్ ''ఇచ్చట వాహనములు నిలుపరాదు''.. అవసరాల శ్రీనివాస్ హీరోగా క్రిష్ - దిల్ రాజు నిర్మిస్తున్న ''101 జిల్లాల అందగాడు'' చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యే పరిస్థితి వచ్చింది. అయితే కోవిడ్ పరిస్థితుల్లో ఇలా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముక్కోణపు పోటీని నివారించడానికి మూడు చిత్రాల నిర్మాతలు చర్చలు జరిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ లో ఏకాభిప్రాయానికి వచ్చిన మేకర్స్.. '101 జిల్లాల అందగాడు' చిత్రాన్ని మరో వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు తాజాగా కొత్త పోస్టర్ తో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మా అందగాడు అలిగాడు.. ఆరు నూరైనా, నూరు నూటొక్కటైనా సెప్టెంబర్ 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అవసరాల శ్రీనివాస్ - 'చి.ల.సౌ' ఫేమ్ రుహనీ శర్మ జంటగా నటించిన ''101 జిల్లాల అందగాడు'' చిత్రానికి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. దీనికి శ్రీనివాస్ అవసరాల కథ అందించారు. దిల్ రాజు - క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. శిరీష్ - వై. రాజీవ్ రెడ్డి - జె. సాయిబాబు ససంయుక్తంగా నిర్మించారు. ఏదేమైనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇలా నిర్మాతలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడం మంచి విషయమనే చెప్పాలి.