బాలీవుడ్‌లో బంపరాఫర్ కొట్టేసిన ఓజి యాక్టర్?
అర్జున్ దాస్ కు బాలీవుడ్ ఆఫర్ రావడం నిజమే అయితే, ఆ సినిమానే ఈ టాలెంటెడ్ నటుడు చేసే మొదటి బాలీవుడ్ మూవీ కానుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమాపై ఎంత హైప్ క్రియేట్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఈ హైప్ వల్ల అందులో నటించిన ప్రతీ ఒక్కరూ చాలా ఫేమస్ అయిపోతున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్ కూడా ఓజి సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఓజి కంటే ముందు నుంచే అర్జున్ దాస్ గొప్ప నటుడు, ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది.
ఖైదీ సినిమాతో నటుడిగా మంచి మార్కులు
ఖైదీ, మాస్టర్ మరియు పలు ఇతర సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్, ఇప్పుడు ఓజి లో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఓజి ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి సినిమాలో అర్జున్ దాస్ క్యారెక్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓజి ట్రైలర్ తోనే అర్జున్ దాస్ విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడాయనకు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
డాన్3 లో విలన్ గా ఆఫర్?
అర్జున్ దాస్ కు బాలీవుడ్ ఆఫర్ రావడం నిజమే అయితే, ఆ సినిమానే ఈ టాలెంటెడ్ నటుడు చేసే మొదటి బాలీవుడ్ మూవీ కానుంది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్న డాన్3లో అర్జున్ దాస్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది. డాన్3 కోసం ఫర్హాన్ ఇప్పటికే అర్జున్ దాస్ తో డిస్కషన్స్ కూడా మొదలుపెట్టారని, చిత్ర హీరో కూడా అర్జున్ ను సినిమాలోకి తీసుకోవడంపై ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారని అంటున్నారు.
ట్రైలర్ తోనే హాట్ టాపిక్ గా మారిన అర్జున్ దాస్
డాన్3 లో ఫర్హాన్ అక్తర్ ఎక్కువ షేడ్స్ ఉన్న ఓ పాత్రను డిజైన్ చేయగా, దానికి అర్జున్ అయితే సరైన న్యాయం చేస్తారని అందరూ భావిస్తున్నారట. డాన్3లో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండటంతో, విలన్ గా అర్జున్ దాస్ నటిస్తే మాత్రం వీరిద్దరి మధ్య వార్ నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం. అర్జున్ దాస్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అతనికి ఓజి సినిమాతో వచ్చిన పాపులారిటీ, క్రేజ్ హాట్ టాపిక్ గా మారింది. అది కూడా కేవలం ట్రైలర్ తోనే ఈ రేంజ్ క్రేజ్ మాటలు కాదు మరి. మరి ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను అర్జున్ ఏ విధంగా వాడుకుంటారో చూడాలి.