స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనక రీజన్ ఏంటి.. ?
సినిమాను ముందు ప్రేక్షకులకు చేరవేసేది సంగీతమే. అందులోనూ ఫలానా సినిమాలో పాటలు బాగుంటాయ్ అంటే చాలు అదో రకమైన పాజిటివిటీ వచ్చేస్తుంది.;
సినిమాను ముందు ప్రేక్షకులకు చేరవేసేది సంగీతమే. అందులోనూ ఫలానా సినిమాలో పాటలు బాగుంటాయ్ అంటే చాలు అదో రకమైన పాజిటివిటీ వచ్చేస్తుంది. సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. జస్ట్ సాంగ్ ఇలా వినేస్తే చాలు అలా ఎవరు పాడారో ఇట్టే కనిపెట్టేస్తారు. అలా తమ గాత్రంతో ఎంతోమంది సంగీత ప్రియులను అలరించిన సింగర్స్ ఉన్నారు. ఐతే సింగర్ గా ఒక లైం లైట్ వచ్చాక కెరీర్ పీక్స్ లో ఉంటుంది. కావాలని ఎవరు దాని నుంచి తప్పుకోవాలని అనుకోరు. కానీ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్ మాత్రం సింగర్ గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
అర్జిత్ సింగ్ స్టార్ సింగర్ గా క్రేజ్..
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అర్జిత్ సింగ్ పాట పాడితే దానికి ఎంతో క్రేజ్ తెచ్చేవారు. ప్లే బ్యాక్ సింగర్ గా స్టార్ సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్న అర్జిత్ సింగ్ 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. సింగర్ గా ఫుల్ డిమాండ్ ఇంకా క్రేజ్ ఉన్న ఈ టైం లో అర్జిత్ సింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రియులను షాక్ అయ్యేలా చేస్తుంది.
ప్లే బ్యాక్ సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అభిమానులను ఏర్పరచుకున్నాడు అర్జిత్ సింగ్. ఐతే అతని రిటైర్మెంట్ వెనక రీజన్స్ ఏంటి ఎందుకు ఆయన ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. తన రిటైర్మెంట్ ప్రకటనలో కూడా సింగర్ గా తన ప్రయాణం ఆపేస్తున్నా అంటూ.. దేవుడు నా పట్ల దయతో ఉన్నాడని.. ఫ్యూచర్ లో మరింత నేర్చుకుంటానని అన్నాడు. ఐతే అతని అనౌన్స్ మెంట్ లో ట్విస్ట్ ఏంటంటే సంగీతం చేయడం మాత్రం ఆపను అంటూ కాస్త ఊరట కలిగించాడు అర్జిత్ సింగ్.
సౌత్ భాషల్లో అర్జిత్ సింగ్ పాటలు..
బాలీవుడ్ లోనే కాదు సౌత్ అన్ని భాషల్లో పాటలు పాడాడు అర్జిత్ సింగ్. తెలుగులో అయితే స్వామిరారా, ఉయ్యాల జంపాల, నువ్వే నా బంగారం, హుషారు రెండేళ్ల క్రితం వచ్చిన ఓం భీం బుష్ సినిమాలో సాంగ్ పాడారు అర్జిత్ సింగ్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాలో కూడా మాతృభూమి సాంగ్ పాడి శ్రోతలను అలరించారు అర్జిత్ సింగ్. ఐతే ఆయన సింగర్ గా బ్రేక్ తీసుకుంటున్నా సంగీతానికి దూరంగా ఉండను అన్న మాట మాత్రం ఆయన ఫ్యాన్స్ కి కాస్త సంతోషాన్ని అందిస్తుంది.
మరి అర్జిత్ సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. అర్జిత్ సింగ్ ఏ కారణం చేత పాటలను పాడటం ఆపేస్తున్నాడో తెలియని ఫ్యాన్స్ మాత్రం అతని పాటలను ఇంకా చాలా వినాలని ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని సరిచేసుకోవాలని అంటున్నారు.