సుమ‌తి పాత్ర‌లో భానుమ‌తి?

భారీ క్యాస్టింగ్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌నే విష‌యాన్ని మేక‌ర్స్ ఎప్పుడో రివీల్ చేశారు.;

Update: 2026-01-28 07:09 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి మూవీ ఎంత పెద్ద హిట్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి రికార్డు సృష్టించ‌డమే కాకుండా దీంతో డార్లింగ్ వెయ్యి కోట్ల క్ల‌బ్ లోకి కూడా ఎంట‌రయ్యారు. బాహుబ‌లి త‌ర్వాత ఆ రేంజ్ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా క‌ల్కి రికార్డు సృష్టించింద‌న్న విషయం అంద‌రికీ తెలిసిందే.

క‌ల్కి2 నుంచి త‌ప్పుకున్న దీపికా ప‌దుకొణె

భారీ క్యాస్టింగ్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌నే విష‌యాన్ని మేక‌ర్స్ ఎప్పుడో రివీల్ చేశారు. అయితే క‌ల్కి సినిమా రిలీజై ఇంత కాల‌మ‌వుతున్నా క‌ల్కి2 ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దానికి కార‌ణాలెన్నో ఉన్నాయి. ప్ర‌భాస్ వేరే సినిమాల‌తో కమిట్ అవ‌డంతో పాటూ, క‌ల్కిలో కీల‌క పాత్ర‌లో న‌టించిన దీపికా ఈ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం కూడా మెయిన్ రీజ‌న్.

క‌ల్కి2 లో సాయి ప‌ల్ల‌వి

క‌ల్కిలో దీపికా చేసిన పాత్ర చాలా కీల‌క‌మైన‌ది. అలాంటి పాత్ర నుంచి ఆమె త‌ప్పుకోవ‌డంతో ఆ పాత్ర‌లో ఎవ‌రిని తీసుకోవాలా అని మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే ఇప్పుడా పాత్ర ఫిదాలో భానుమ‌తిగా న‌టించి ఎంతోమంది మన‌సుల్ని గెలుచుకున్న సాయి ప‌ల్ల‌విని వ‌రించింద‌ని స‌మాచారం. క‌ల్కి2లో సాయి ప‌ల్లవి ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయ్యార‌ని, త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముందని తెలుస్తోంది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో క‌ల్కి2

అదే నిజ‌మైతే ప్ర‌భాస్, సాయి ప‌ల్ల‌వి క‌లిసి ఒకే సినిమాలో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుండ‌గా, ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. క‌ల్కిలో సుమ‌తి క్యారెక్ట‌ర్ ఎంత కీల‌క‌మైన‌దో తెలిసిందే. అలాంటి పాత్ర‌కు మంచి పెర్ఫార్మ‌ర్ లేక‌పోతే మొద‌టికే దెబ్బ అనుకుని చిత్ర యూనిట్ సాయి ప‌ల్ల‌విని తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉన్న క‌ల్కి2 టీమ్, ఈ స‌మ్మ‌ర్ నుంచి షూటింగ్ ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రామాయ‌ణ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి క‌ల్కి2లో న‌టిస్తే క్రేజ్ ప‌రంగా కూడా వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Tags:    

Similar News